- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. చిక్కుల్లో మరో బీజేపీ నేత (వీడియో వైరల్)
ప్రజా సేవకు అంకితం కావాల్సిన రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సేవకు అంకితం కావాల్సిన రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. మహిళా సాధికారత అంటూ లెక్చర్లు దంచే నేతలే వారి పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజానికి మాయని మచ్చగా నిలుస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బీజేపీ నాయకుడు బబ్బన్ సింగ్ రఘువంశీ ఇటీవలే ఓ విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ ఆర్కెస్ట్రాలో అమ్మాయి డాన్స్ చేస్తూ బబ్బన్ సింగ్ వద్దకు రాగా.. అతడు ఆమెను ఏకంగా ఒళ్లో కూర్చొబెట్టుకుని తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెకు ముద్దు కూడా పెట్టాడు.
అయితే, ఈ తతంగాన్ని అంతా అక్కడున్న ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. కాగా, అదే ఆ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ నేత పంకజ్ రాజ్‌భర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ నాయకుడి ద్వంద్వ విధానాలు మీరూ చూడండంటూ కామెంట్ చేశారు. నిజాయితీ, భారతీయ సంస్కృతిపై తరచూ ఉపన్యాసాలు ఇచ్చే వారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన సమాన్య జనం మహిళల పట్ల పేరున్న నాయకుడు ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ మాట్లాడుతూ.. బబ్బన్ సింగ్ రఘువంశీ చేసిన పని సిగ్గుచేటని అభివర్ణించారు. మహిళల పట్ల బీజేపీ చూపించే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత పంకజ్ రాజ్‌భర్ ఆ పోస్ట్‌ను ‘X’ (ట్విట్టర్) నుంచి తొలగించారు.






