యూనివర్సిటీలో సంచలనం.. పీరియడ్స్ కారణంగా ఆలస్యంగా వచ్చిన మహిళా ఉద్యోగులు.. ఫొటోస్ పంపమని ఆదేశించిన సూపర్ వైజర్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:40:07  IST  )

హర్యానా రోహ్తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులకు దారుణమైన అవమానం జరిగింది. గవర్నర్ బండారు దత్తాత్రేయ సంద్శనా సమయంలో పనికి

యూనివర్సిటీలో సంచలనం.. పీరియడ్స్ కారణంగా ఆలస్యంగా వచ్చిన మహిళా ఉద్యోగులు.. ఫొటోస్ పంపమని ఆదేశించిన సూపర్ వైజర్..
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా రోహ్తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులకు దారుణమైన అవమానం జరిగింది. గవర్నర్ బండారు దత్తాత్రేయ సంద్శనా సమయంలో పనికి ఆలస్యంగా వచ్చారు నలుగురు సానిటేషన్ వర్కర్లు. కారణం ఏంటని ప్రశ్నించిన సూపర్ వైజర్లకు పీరియడ్స్ వచ్చాయని, కడుపు నొప్పి కారణంగా లేట్ అయిందని చెప్పారు. అయితే తాము నమ్మమని.. శానిటరీ ప్యాడ్ ఫొటోస్ వాట్సాప్ చేయాలని ఆదేశించారు. రెస్ట్ రూమ్‌కు వెళ్లి దుస్తులు తీసేసి.. ఒకరినొకరు తనిఖీ చేయాలని చెప్పారు.

దీన్ని గౌరవానికి, ప్రైవసీపై దాడిగా వర్ణించిన ఉద్యోగులు.. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ.. విషయాన్ని MDU రిజిస్ట్రార్ కృష్ణ కాంత్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. ఇది వర్క్‌ప్లేస్ ఎథిక్స్‌ను ఉల్లంఘించడమేనని.. 2013 సెక్షువల్ హారస్‌మెంట్ ఆఫ్ వుమెన్ అట్ వర్క్‌ప్లేస్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తుందని ఎత్తిచూపారు. ఈ విషయం మీడియా దృష్టికి తీసుకురాగా.. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేసింది.

Next Story