- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video Viral:ఇంట్లో అర్ధరాత్రి వింత శబ్దాలు.. వంట గదిలోకి వెళ్లగా.. ఆ పెద్ద ఆకారాన్ని చూసి కేకలు వేసిన కుటుంబ సభ్యులు!
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే.. అడవుల్లో ఎన్నో రకాల జంతువులు నివాసం ఉంటాయి. సాధారణంగా అడవుల్లో పెద్ద పెద్ద పులులతో పాటు చిరుతలు, సింహాలు, జింకలు ఇతర అరుదైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి. అయితే అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోని పంట పొలాల్లోకి అడవి జంతువులు, జింకలు, ఇతర వన్యప్రాణులు చొరబడి పంటలను నాశనం చేస్తుంటాయి. సాధారణంగా అడవిలో ఉండే క్రూరమృగాలను చూడాలంటే జూ పార్క్‌లలోకి వెళుతుంటారు. కానీ.. ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఇళ్లలోనే దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రే కాదు పట్టపగలు కూడా ఇళ్లలోకి ప్రవేశించి హల్‌చల్ సృష్టిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో సింహం ఏకంగా ఓ ఇంట్లోని వంట గదిలోకి ప్రవేశించింది.
గుజరాత్(Gujarat) అమ్రేలి జిల్లా(Amreli District)లోని కోవాయ గ్రామంలో ఓ ఇంట్లోకి సింహం(Lion) ప్రవేశించిన ఘటన చోటుచేసుకుంది. అర్దరాత్రి ఇంట్లో చప్పుళ్లు వినిపించాయి. అటు ఇటు చూసిన ఏం కనిపించలేదు. కానీ వంట గదిలోకి వెళ్లగా.. ఓ పెద్ద ఆకారం గల జంతువు కనిపించింది. ఈ క్రమంలో వంట గదిలోకి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ఏదో పెద్ద ఆకారంతో ఉన్న జంతువు కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ తరుణంలో మెళ్లిగా లైట్ వేసి చూసే సరికి వంటగది గోడపై నక్కి చూస్తున్న సింహం కనిపించింది. ఇంకేముంది.. అందరూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉందని, ఆహారం కోసం సింహం వచ్చి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.






