పెళ్ళికి వచ్చిన బంధువులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు

by Muthe.Rajitha |

సాధారణంగా పెళ్ళికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు రిటర్న్ గిఫ్టులు ఇస్తూ ఉంటారు.

పెళ్ళికి వచ్చిన బంధువులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పెళ్ళికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు రిటర్న్ గిఫ్టులు ఇస్తూ ఉంటారు. అయితే వధువు తరపున వారు వినూత్నంగా ఆలోచించి, సోషల్ రెస్పాన్సిబిలిటీతో తమ వివాహానికి వచ్చిన వారందరికీ హెల్మెట్లను రిటర్న్ గిఫ్టులు ఇచ్చారు. రాజస్థాన్‌లోని కుచామన్ సిటీలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘జంఝువారి’ అనే సంప్రదాయం ప్రకారం బారాత్‌కు వచ్చేవారికి గిఫ్ట్‌లు ఇచ్చే.. ఆచారాన్ని కొత్త కోణంలో కొనసాగిస్తూ.. బారాత్‌కు హాజరైన మొత్తం 286 మందికి హెల్మెట్‌లు బహుమతిగా ఇచ్చారు. వధువు తాత రామ్‌కరణ్ మొదటి హెల్మెట్‌ను వరుడికి అందించగా, తర్వాత మిగతా హెల్మెట్‌లను అందరికీ పంచారు.

రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్మెట్ వినియోగంపై జనాల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వధువు కుటుంబం తెలిపింది. ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలో కూడా సామాజిక బాధ్యతను చాటవచ్చని నెటిజన్లు వారి ఆలోచనకు సెల్యూట్ చేస్తున్నారు.

Next Story