- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళతో రెస్టారెంట్‌లో ప్రత్యక్ష్యమైన ఐఐటీ బాబా.. ఇంతకీ ఎవరీమే..!
కుంభమేళాలో వైరల్ అయిన వారిలో ఐఐటీ బాబా(Abhay Singh) ఒకరు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కుంభమేళాలో వైరల్ అయిన వారిలో ఐఐటీ బాబా(Abhay Singh) ఒకరు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది మరువక ముందే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ హోటల్(Jaipur Restaurant)లో ప్రత్యక్ష్యమయ్యాడు. అక్కడ ఆయన ఓ మహిళతో భోజన చేస్తూ కనిపించాడు.
అంతకుముందు మరో హోటల్‌లో గొడవ చేస్తూ పోలీసులకు కనిపించాడు. అనుమానంతో పోలీసులు టెస్టులు చేయగా.. గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. ఇంకాస్త గట్టిగా మందలించడంతో అతని వద్దనున్న గంజాయిని పోలీసులకు అప్పగించాడు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించినట్లు తేలడంతో బెయిల్‌పై విడిచిపెట్టారు. అయితే.. ఐఐటీ బాబాతో హోటల్‌కు వెళ్లిన యువతి ఎవరనే దానిపై నెటింట తెగ చర్చ జరుగుతోంది. స్నేహితురాలా, ప్రియురాలా, లేక బంధువా? అనేది తెలియాల్సి ఉంది.






