ఐస్‌క్రీం ఇంత దారుణంగా తయారు చేస్తారా.. ఈ వీడియో చూస్తే జన్మలో తినరు!

by Ajay Maddhiboyina |

చాలా మంది ఐస్‌క్రీం అంటే ఎగబడి తినేస్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఐస్‌క్రీం వచ్చిందంటే చాలు కొన్నివ్వకపోతే చుక్కలు చూపిస్తారు. ఇక యూత్ కూడా ఐస్‌క్రీం పార్లలో కూర్చుకుని కబుర్లు చెప్పుకుంటూ కప్పులు కప్పులు లేపేస్తుంటారు.

ఐస్‌క్రీం ఇంత దారుణంగా తయారు చేస్తారా.. ఈ వీడియో చూస్తే జన్మలో తినరు!
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ఐస్‌క్రీం అంటే ఎగబడి తినేస్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఐస్‌క్రీం వచ్చిందంటే చాలు కొన్నివ్వకపోతే చుక్కలు చూపిస్తారు. ఇక యూత్ కూడా ఐస్‌క్రీం పార్లలో కూర్చుకుని కబుర్లు చెప్పుకుంటూ కప్పులు కప్పులు లేపేస్తుంటారు. అయితే వాటిని ఎలా చేస్తుంటారు అని మాత్రం పట్టించుకోరు. ఇంట్లో చేసినవి ఏవైనా శుభ్రంగా ఉంటాయి కానీ బయట తయారు చేసిన ఆహారం అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. తాజాగా వైరల్ అవుతున్న ఐస్‌క్రీం మేకింగ్ వీడియో చూస్తే మాత్రం జన్మలో దాని జోలికి వెళ్లరు. ఇంత దారుణంగా ఐస్ క్రీం తయారు చేస్తారా అని ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని వ్యక్తి అపరిశుభ్రంగా ఉన్న గదిలో ఐస్ క్రీంలు తయారు చేశాడు.

మొదట ఒక బిందలోని రంగునీళ్లను ఐస్ క్రీం అచ్చు ట్రేలలో పోశాడు. తరవాత వాటిని కూలింగ్ నీటిలో వేసి తరవాత అందులో ఐస్ క్రీం స్టిక్స్ పెట్టాడు. తయారు చేస్తున్న క్రమంలో అతడు పూర్తిగా చెమటతో ఉండగా చేతులు సైతం అపరిశుభ్రంగానే ఉన్నాయి. ఐస్ క్రీంలను తయారు చేస్తున్న సమయంలో అతడి చెమట సైతం అందులోనే పడిపోతుంది. నాచురల్ గా కాకుండా రంగులతో, రసాయనాలతో వాటిని తయారు చేశాడు. ఇక తయారు చేసిన తరవాత ఆ ఐస్ క్రీం లను బయటకు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వగా ఎక్స్‌లో దీనిని 2 మిలియన్లకు పైగానే యూజర్లు చూశారు. అంతే కాకుండా ఇండియాలో హైజీన్ బ్యాన్ చేశారు... దీన్ని ఐస్ క్రీం అనొద్దు.. అంటూ రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. VIDEO

Next Story