- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోపై ఐబొమ్మ రవి పోస్టర్.. తెలంగాణ రియల్ హీరో అంటూ మద్దతు(వీడియో)
ఐబొమ్మ రవి తెలంగాణలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇంతకు ముందు పోలీసులకు సవాల్ విసిరిన ఆయన రీసెంట్‌గా పట్టుబడగా.. అసలు ఆయన చేసిన దాంట్లో తప్పేముందని.. అటు తెలుగు ఇండస్ట్రీని.. ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్న జనాలు..

దిశ, వెబ్ డెస్క్ : ఐబొమ్మ రవి తెలంగాణలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇంతకు ముందు పోలీసులకు సవాల్ విసిరిన ఆయన రీసెంట్‌గా పట్టుబడగా.. అసలు ఆయన చేసిన దాంట్లో తప్పేముందని.. అటు తెలుగు ఇండస్ట్రీని.. ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్న జనాలు.. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు అయితే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేవుడనే అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ అతనికి మద్దతుగా.. ఆటో వెనకాల పోస్టర్ వేసుకున్నాడు. సాధారణంగా హీరో హీరోయిన్ల ఫొటోలు, కొటేషన్లు కనిపిస్తుంటాయి కానీ ఈ సారి ఐబొమ్మ రవి కనిపించడంతో వీడియో వైరల్ అయిపోయింది. తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవన్న అంటూ ఇలా ఆటోపై ఫొటో ద్వారా అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
ఇక ఈ ఘటనపై స్పందిస్తున్న జనాలు.. ఆడు మగాడ్రా బుజ్జి యావత్ ప్రపంచమే వాడి వైపు చూసేలా చేశాడు.. అబ్జల్యూట్ సినిమా.. అని కొందరు అంటుంటే... ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని పోలీసులు ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.






