- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐబొమ్మ అడ్మిన్‌కు బొమ్మ చూపించిన భార్య.. పెళ్లానికి చుక్కలు చూపిద్దామంటే పక్కా స్కెచ్‌తో అతడి జీవితాన్నే క్లోజ్ చేసేసిందిగా..
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భార్యతో విడాకులు తీసుకుని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కీట్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను..

దిశ, వెబ్ డెస్క్ : ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భార్యతో విడాకులు తీసుకుని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కీట్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను.. సినిమా ఇండస్ట్రీకి నిద్రలేకుండా చేశాడు. ఏకంగా మూడు వేల కోట్ల నష్టం కలిగించాడని అంచనా. కాగా ఓ సందర్భంలో పోలీసులకే సవాల్ విసిరాడు. నన్ను పట్టుకోలేరని డైలాగ్‌లు వేశాడు.. కానీ ఇండియాకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు.
భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ అడ్మిన్‌ను ఆమెనే పట్టించిందని సోషల్ మీడియా టాక్. అతనిపై రివేంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా చేసిందని తెలుస్తోంది. పెళ్లానికి చుక్కలు చూపిద్దామనుకుంటే.. ఆమెనే రివర్స్‌లో ఐబొమ్మ అడ్మిన్‌కు బొమ్మ చూపించింది. అతని ఎకౌంట్ నంచి మూడు కోట్లు సీజ్ చేయడంతో పాటు జైలులో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. మొత్తానికి బిజినెస్‌తోపాట జీవితాన్ని క్లోజ్ చేసేసిందని పోస్టులు వస్తున్నాయి.






