ఆ పాపకు నేను తండ్రిని కాదు బ్రో.. నన్ను చీట్ చేసింది.. సోషల్ మీడియా స్టోరీకి రిలేట్ అవుతున్న యూత్

by Sujitha Rachapalli |

అనగనగా ఇద్దరు కపుల్స్.. సారా అండ్ జాయ్. చాలా ఏళ్లుగా పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సంతాన ప్రాప్తి జరగలేదు. ఆల్ ఆఫ్ సడెన్ ఒకరోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అమ్మాయి.

ఆ పాపకు నేను తండ్రిని కాదు బ్రో.. నన్ను చీట్ చేసింది.. సోషల్ మీడియా స్టోరీకి రిలేట్ అవుతున్న యూత్
X

దిశ, ఫీచర్స్ : అనగనగా ఇద్దరు కపుల్స్.. సారా అండ్ జాయ్. చాలా ఏళ్లుగా పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సంతాన ప్రాప్తి జరగలేదు. ఆల్ ఆఫ్ సడెన్ ఒకరోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అమ్మాయి. ఆయనకు షాకింగ్‌గా ఉన్నా ఏ దేవుడు కరుణించాడో అని పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆమెను కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ నాలాగే ఉండాలని మురిసిపోతున్నాడు. కానీ మూడు నెలల తర్వాత ఈ కథలో ఓ ట్విస్ట్ ఇచ్చింది విధి. బ్రియాన్ అనే ఓ అబ్బాయి జాయ్ ఆఫీసుకు వచ్చి.. హలో ఐయామ్ సారా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు. పుట్టబోయే బిడ్డకు తనే బయాలాజికల్ ఫాదర్ అని చెప్పాడు. వారి మధ్య జరిగిన రిలేషన్ గురించి ఆధారాలతో సహా చూపించాడు. దీంతో జాయ్‌కు తల గిర్రున తిరిగింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ బాగా ఆలోచించి బేబీ పుట్టే వరకు వెయిట్ చేద్దామని అనుకున్నడు. అసలు నిజం తెలిసిన ఆరు నెలలు భరించాడు.

మొత్తానికి సారా లేబర్ రూమ్‌కు వెళ్లింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన చేతులతో ముద్దాడాలని జాయ్‌కు ఉన్నా తన పాప కాదు కదా అని బాగా ఏడ్చేశాడు. ఇలాంటి ఒక రోజు వస్తే తన ప్రేమనంతా సారాపై కురిపించాలని అనుకున్నాడు. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాలనుకున్నాడు. కానీ ఇప్పుడు.. ఆ బేబీని టచ్ చేయకుండానే ఉండిపోయాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. అదేంటి అని షాక్ అయింది సారా.. దీంతో బ్రియాన్‌ను చూపించిన అతను ఇదంతా నాకు ముందే తెలుసని, కడుపుతో ఉన్న సమయంలో బాధ పెట్టకూడదని ఇన్నాళ్లు భరించినట్లు బాధపడుతూ వివరించాడు. మొత్తానికి బ్రియాన్ బయాలాజికల్ ఫాదర్‌గా సైన్ చేసి బేబీని హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు. కానీ జాయ్ మాత్రం తనకు సారా చేసిన ద్రోహాన్ని మరిచిపోలేక సోషల్ మీడియాలో ఈ కథ షేర్ చేశాడు. ‘‘మీరు నన్ను సైకో అనుకున్నా పర్వాలేదు కానీ నేను చేయాల్సింది ఇదే అని అనిపించింది. ఇంతకు మించి ఏం చేయాలో అర్థం కాలేదు’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అనదర్ డే అనదర్ ఫియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లవ్, మ్యారేజ్ అంటేనే భయపడాల్సిన రోజులు వచ్చేశాయని.. వీటన్నింటికి దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు. ఈ స్టోరీలో నువ్వే బాధితుడివి బ్రో.. నువ్వు ఈ పెయిన్ నుంచి త్వరగా హీల్ కావాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు.


Next Story