- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పాస్ట్ గురించి చెప్పాక భర్త టార్చర్ చేస్తున్నాడు.. నెట్టింట యువతి వీడియో వైరల్
పెళ్లి తరవాత తన పాస్ట్ గురించి చెప్పడమే ఓ యువతికి శాపంగా మారింది. చెప్పిన తరవాత అందులో తన తప్పు ఏం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ భర్త వేదించడం మొదలుపెట్టాడు. పదే పదే ఆమె పాస్ట్ ను గుర్తు చేస్తూ వేధించడంతో పాటు అదే అదునుగా భావించి అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి తరవాత తన పాస్ట్ గురించి చెప్పడమే ఓ యువతికి శాపంగా మారింది. చెప్పిన తరవాత అందులో తన తప్పు ఏం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ భర్త వేదించడం మొదలుపెట్టాడు. పదే పదే ఆమె పాస్ట్ ను గుర్తు చేస్తూ వేధించడంతో పాటు అదే అదునుగా భావించి అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. చివరికి పెళ్లైన 16 నెలలకే తన భార్యను పుట్టింటింకి పంపించేశాడు. దీంతో ఏడాది కూడా నిండని బిడ్డతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో తన బాధను చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. తన భర్తను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు యువతి చెబుతోంది. పెళ్లి తరవాత చాలా సంతోషంగా ఉన్నామని కానీ కొన్ని నెలల నుండి తన భర్త టార్చర్ చేయడం మొదలుపెట్టాడని చెప్పింది.
పదే పదే తన పాస్ట్ గురించి మాట్లాడుతూ సంబంధాలు అంటగడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా నిందిస్తున్నాడని తెలిపింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ప్రేమగా చూసుకోలేదని, బిడ్డ పుట్టిన తరవాత టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయానని తెలిపింది. లక్షల్లో కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం తన అత్తామామ సైతం వేధిస్తున్నారని చెప్పింది. దీంతో ఈ కాలపు పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ జనరేషన్ లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా పాస్ట్ రిలేషన్ షిప్స్ కామన్. అయితే ఆ రిలేషన్ షిప్ గురించి భర్త లేదా భార్య దగ్గర చెబితే మానసిక వేధింపులు తప్పవని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిజాయితీగా జరిగింది చెప్పినా లేనిపోని అనుమానాలతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.






