- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ పై భార్యాభర్తలు..ఒకే సిగరెట్ ఇద్దరు కాల్చుతూ..!
సోషల్ మీడియాలో.. రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే మరికొన్ని చాలా భయానకంగా

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో.. రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే మరికొన్ని చాలా భయానకంగా ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు చూస్తే మనం నవ్వు ఆపుకోలేం. అయితే తాజాగా ఓ సన్నివేశం కూడా అచ్చం అలాగే ఉంది. భార్యా భర్తలిద్దరూ కూడా ఒకే సిగరెట్ తాగిన సంఘటన.. బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. భార్యాభర్తలిద్దరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ... ఇద్దరూ హెల్మెట్ ధరించి బైక్ పై వెళుతున్నారు. వాళ్ల వాలకం చూస్తుంటే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అంటే కచ్చితంగా.... సిగరెట్ తాగే అలవాటు ఉంటుందని అందరూ సాధారణంగా అనే మాట. అయితే దానికి తగ్గట్టుగానే ఈ ఇద్దరు ఒకే సిగరెట్.. తాగేశారు. అదే ఇంట్లో తాగితే.. ఇది పెద్ద వార్త కాకపోయేది.
కానీ ఈ ఆదర్శ దంపతులిద్దరూ ఒకే సిగరెట్... బైక్ పైన ట్రాఫిక్ విపరీతంగా ఉన్న సమయంలో తాగారు. మొదట సిగరెట్ అంటించి రెండు సార్లు పీల్చేసి.. ఆ తర్వాత బైక్ నడిపే తన భర్త నోటిలో సిగరెట్ పీక పెట్టింది ఆ ఉత్తమ మహిళ. దీంతో అతడు సిగరెట్ గట్టిగా పీల్చి.. భార్యకు వదిలేస్తాడు. ఈ వీడియోలో వెనుక నుంచి ఎవరో క్యాప్చర్ చేసి... సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక క్షణాల్లో వైరల్ గా మారింది. ఇంకేముంది దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తూ.. నెటిజెన్స్ రెచ్చిపోతున్నారు.






