ఆ విమానంలో భారీ కుదుపులు.. నెట్టింట్లో జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 09:13:55  IST  )

వరుస హెలికాప్టర్ (Helicopter), విమాన ప్రమాదాలు దేశ ప్రజలను భయంతో కుదిపేస్తున్నాయి.

ఆ విమానంలో భారీ కుదుపులు.. నెట్టింట్లో జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస హెలికాప్టర్ (Helicopter), విమాన ప్రమాదాలు దేశ ప్రజలను భయంతో కుదిపేస్తున్నాయి. ఇక మూడు రోజులుగా ఎయిరిండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో జనం ఆ విమామానాలు ఎక్కాలంటేనే జంకుతున్నారు. మరికొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా.. కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోవా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అదే విమానంలో ఉన్న ఓ జర్నలిస్టు సెల్ఫీ వీడియో తీసి ఇండిగో (Indigo) ఫ్లైట్ నిర్వాకం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘నేను ఇండిగో విమానంలో ఉన్నా. ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6811లో గోవా నుంచి లక్నో వెళ్తున్నాను. ఫ్లైట్ టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో భారీ కుదుపులకు గురైంది, బ్యాలెన్స్ తప్పింది. నేను తీవ్ర భయాందోళకు గురయ్యా. క్షేమంగా ఇంటికి చేరాలని ఆశిస్తున్నా.. ఇంట్లో అంతా నాకోసం వేచి చూస్తున్నారు. విమానం కుదుపులకు గురవుతోందని.. కనీసం ఫ్లైట్ క్రూ మెంబర్స్, పైలెట్లు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇవాళ నేను అనుభవించిన టెన్షన్.. మరొకరు అనుభవించొద్దని ఆ మహిళా జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు.

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1934893176461926445

Next Story