పానీపూరి బండి వద్దకు వచ్చిన కోతులు.. ఎంత క్యూట్‌గా తింటున్నాయో!(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-08 14:39:40  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది.

పానీపూరి బండి వద్దకు వచ్చిన కోతులు.. ఎంత క్యూట్‌గా తింటున్నాయో!(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. నిత్యం వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక, కోతులకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. కోతుల చేష్టలు చూస్తే భలే సరదాగా ఉంటుంది. కొన్ని సార్లు కోతులు మనుషుల్లా ప్రవర్తిస్తుంటాయి. కోతులు కొన్నిసార్లు చాలా వింతైన పనులు చేస్తున్నట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కోతులు పానీపూరి తినడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాత్రిపూట పానీపూరి తింటుంటే ఆ మజానే వేరు. చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది. ఈ పానీపూరికి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి పానీపూరిని.. గోల్గాప్ప, ఫుచ్కా, బటాషా అని కూడా అంటారు. మనుషులే కాదండోయ్.. కోతులు కూడా పానీపూరిని లాగించేస్తాయి. ఓ వీడియోలో ఒకటి కాదు ఏకంగా మూడు కోతులు ఒకేసారి పానీపూరి తినడం కనిపిస్తుంది.

మూడు కోతులు పానీ పూరి బండి మీద కూర్చుని ఉన్నాయి. పానీపూరి విక్రయించే అతను పక్కన నిల్చుని నవ్వుతున్నాడు. రెండు కోతుల చేతిలో పానీపూరి ఉంది. కానీ మూడవ కోతి పానీపూరీ నీటి నుంచి తీసి దాని నుంచి నీరు తాగుతుంది. అదే సమయంలో ఇతర కోతులు పానీపురి నీటి కంటే గోల్గాప్ప పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సాధారణంగా కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. అవి వాటి కడుపు నింపుకోవడానికి గుడికి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ప్రసాదం, పండ్లు లాక్కుంటాయి. కానీ అవి సరదాగా కలిసి వచ్చి ఒకే చోట పానీపూరి తింటుండం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మూడు కోతులు పానీపూరి తినే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story