- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్ వై-ఫై ఆటో కనెక్షన్.. బ్రేక్ అప్ చెప్పిన ప్రియుడు.. అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జంటగా సరదాగా గడిపేందుకు సంతోషంగా హోటల్‌కు వెళ్లిన ప్రేమికులు విడిపోయి బయటకి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: జంటగా సరదాగా గడిపేందుకు సంతోషంగా హోటల్‌కు (Hotels) వెళ్లిన ప్రేమికులు విడిపోయి బయటకి వచ్చారు. అందుకు కారణం.. వారు వెళ్లిన హోటల్ వైఫై. మొదటిసారి హోటల్ వెళ్లిన హోటల్ వైఫై ప్రియురాలి ఫోన్‌కు ఆటో కనెక్ట్ అయింది. దీంతో అనుమానంతో ప్రియుడు బ్రేక్ అప్ చెప్పాడు. నిజానికి ప్రియురాలి మొదటిసారే ఆ హోటల్ వెళ్లింది. మరీ ఎలా వైఫై (Wifi) ఆటో కనెక్ట్ అయిందో తెలుసుకునేందుకు ఇన్విస్టిగేషన్ సైతం జరిగింది. ఈ వింత ఆశ్చర్యకర ఘటన చైనాలో వెలుగుచూసింది.
చైనాలోని (China) చాంగ్‌కింగ్ నగరంలో హాలీ డే కోసం ఓ జంట హోటల్‌కు వెళ్లారు. అయితే, చెకిన్ టైంలో ప్రియురాలి ఫిజికల్ డాక్యుమెంట్స్ కనిపించలేదు. దీంతో డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించేందుకు హోటల్ వైఫై కనెక్ట్ చేసుకునేందుకు చూడగా.. ఆటో కనెక్ట్ అయి ఉంది. దీంతో ఆమె ప్రియుడు అనుమానించాడు. ఇంతకు ముందు ఈ హోటల్‌కి వచ్చావు కదా అంటూ నిలదీశాడు. ఆమె మొదటిసారి వచ్చానని చెబితే.. మరీ హోటల్ వైఫై ఎలా కనెక్ట్ అయిందని ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఆమెకు బ్రేక్ అప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన తప్పేం లేదని, తన నిర్ధోషిత్వాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలనుకుంది.
ఇంతటితో ఆగకుండా.. వైఫై కనెక్షన్ వెనుక గల కారణాన్ని బయటపెట్టేందుకు హోటల్ సిబ్బందిని ప్రశ్నించింది. హోటల్ సిబ్బంది వివరణ మేరకు.. చాంగ్‌కింగ్‌లోని మరో హోటల్‌లో బాధిత యువతి పనిచేసింది. అదే హోటల్ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో వైఫైని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే తన ప్రియుడికి పరిస్థితిని వివరించడానికి అతన్ని సంప్రదించింది. కానీ అతను ఆమెతో మాట్లాడటానికి నిరాకరించాడు. దీంతో తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు గానూ స్థానిక వార్తా ఛానెల్‌ని సంప్రదించింది. జరిగిన విషయం అంతా వివరించింది.
యువతి చెప్పిన సమాచారం మేరకు ఆమె నిర్ధోషిత్వాన్ని నిరూపించేందుకు ఒక రిపోర్టర్ ఆమె పనిచేసిన హోటల్‌కి వెళ్లాడు. అక్కడ ఆమె వైఫైకి కనెక్ట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె, ఆమె ప్రియుడు వెళ్లిన హోటల్‌కు వెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రిపోర్టర్ ఫోన్ కూడా అదే విధంగా హోటల్ వైఫైకి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయింది. దీంతో ఆమె చెప్పింది నిజమేనని, ఆమె ఏ తప్పు చేయలేదని నిరూపించింది. కానీ, తనను నమ్మని వ్యక్తితో సంబంధాన్ని తిరిగి ప్రారంభించాలని తాను కోరుకోవడం లేదంటూ చెప్పేసింది.






