Viral video: ఆమె భయాన్ని జయించేందుకు అతడి మాటలే ధైర్యంగా మారాయి!

by Yella Dhawani Reddy |

బంగీ జంపింగ్.. ఎత్తైన కొండలు లేదా బ్రిడ్జిల పై నుంచి తాళ్లను కాళ్లకు, శరీరాన్ని కట్టుకొని కిందకు తలకిందులుగా దూకుతారు.

Viral video: ఆమె భయాన్ని జయించేందుకు అతడి మాటలే ధైర్యంగా మారాయి!
X

దిశ, వెబ్ డెస్క్: బంగీ జంపింగ్ (Bungee jumping).. ఎత్తైన కొండలు లేదా బ్రిడ్జిల పై నుంచి తాళ్లను కాళ్లకు, శరీరాన్ని కట్టుకొని కిందకు తలకిందులుగా దూకుతారు. గుండె ఆగిపోయేంతా థ్రిల్ కలిగించే ఈ అద్భుతమైన అనుభవాన్ని ఒక్కసారైనా జీవితంలో తప్పనిసరిగా అనుభవించాలని నేటితర యువత ఎంతోమంది కోరుకుంటారు. అందులోనూ ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్, ప్రకృతి సౌందర్యం నడుమ ఏర్పాటు చేసిన బంగీ జంపింగ్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక ఇటీవల రిషీకేష్‌లోని (Rishikesh) హిమాలయన్ బంగీ జంపిగ్ సెంటర్‌లో ఓ దృశ్యం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. భయం, నమ్మకం, మానవత్వం అన్నీ ఒకేసారి ఎలా పని చేస్తాయో ఈ వీడియోలో మనం చూడొచ్చు.

ఈ వైరల్ వీడియోలో ఓ యువతి బంగీ ప్లాట్‌ఫాం ఎడ్జ్‌ దగ్గర నిలబడి కనిపిస్తుంది. ఆమె ముఖంలో స్పష్టంగా భయం కనిపిస్తోంది. 'ఒక నిమిషం టైం ఇవ్వండి' అని ఆమె మళ్లీ మళ్లీ అడుగుతుంది. అక్కడే ఉన్న సిబ్బంది సభ్యుడు ఎంతో నమ్మకంగా 'ఒక నిమిషం హెల్ప్ చేయదు మేడమ్. లెట్స్ గో' అంటూ ఆమెలో మనోధైర్యం కలిగించారు. ఆ క్షణాల్లో యువతి తన భయంతో తడబడుతూ 'నేను మధ్యలో ఊపిరి తీసుకోలేకపోతానేమో' అని చెబుతుంటే, ఆ సిబ్బంది సభ్యుడు ఎంతో సానుభూతితో, 'అలా ఏం జరగదు. ఇది అంతా ఓవర్ థింకింగ్. మీరు బ్రెయిన్ వాడుతున్నారు. హార్ట్ వాడండి మేడమ్' అని ఉత్సాహపరిచారు. 'మీరు 200% సేఫ్ మేడమ్. అందరికీ భయం ఉంటుంది. కానీ మీరు మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి' అని చెప్పి, ఆమెను ఆ క్షణానికి మానసికంగా సిద్ధం చేశారు. చివరికి '3… 2… 1… నైస్!' అని గట్టిగా కౌంట్ చేయగా, ఆ యువతి ఎట్టకేలకు ధైర్యంగా జంప్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. 38 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు చాలా ఉద్వేగంగా స్పందించారు. 'ఇది కేవలం బంజీ జంప్ కాదు, ఆ యువతికి నమ్మకాన్ని ఇచ్చిన మానసిక థెరపీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story