రియల్ లైఫ్‌లో ‘హాయ్ నాన్న’ సినిమా రిపీట్.. మెదడుకు గాయంతో భర్తను మరిచిపోయింది.. కానీ ఏరి కోరి అతన్నే మళ్లీ ప్రేమించి..

by Sujitha Rachapalli |

‘హాయ్ నాన్న’ సినిమా చూశారా? నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కథ విషయానికి వస్తే ఓ యాక్సిడెంట్‌లో మెదడుకు గాయం కారణంగా

రియల్ లైఫ్‌లో ‘హాయ్ నాన్న’ సినిమా రిపీట్.. మెదడుకు గాయంతో భర్తను మరిచిపోయింది.. కానీ ఏరి కోరి అతన్నే మళ్లీ ప్రేమించి..
X

దిశ, ఫీచర్స్ : ‘హాయ్ నాన్న’ సినిమా చూశారా? నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కథ విషయానికి వస్తే ఓ యాక్సిడెంట్‌లో మెదడుకు గాయం కారణంగా ప్రేమ, పెళ్లి, భర్త, పాప గురించి మరిచిపోయిన హీరోయిన్‌ను తన తల్లి కావాలనే హీరోకు దూరం చేస్తుంది. ఇవేవి తెలియని హీరోయిన్.. మళ్లీ అతనితోనే ప్రేమలో పడుతుంది. భారీ ట్విస్ట్‌ల తర్వాత పెళ్లి కూడా చేసుకుంటుంది. రియల్ లైఫ్ స్టోరీలో కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే జరగ్గా.. ఇందుకు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ చూద్దాం.

2016లో లారా ఫాగనెల్లో కెనడాలో పని చేస్తున్న సమయంలో ఆమెపై పెద్ద స్తంభం పడటంతో తలకు తీవ్రమైన గాయమైంది. దీని కారణంగా మెమొరీ లాస్ జరిగింది. బ్రేడెన్ ఫాగనెల్లోతో జరిగిన వివాహం, ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా కోల్పోయింది. పెను సవాళ్లను ఎదుర్కొనేలా చేసింది. కానీ కష్టసమయంలో బ్రేడెన్ లారాకు అనుకూలంగా ఉన్నాడు. ఓపికగా ఆమెతో సమయాన్ని గడిపాడు. కొత్త జ్ఞాపకాలను సృష్టించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రాసెస్‌లో లారా తన గత వివాహాన్ని గుర్తుంచుకోకపోయినా.. బ్రేడెన్‌తో మళ్లీ సంబంధం ఏర్పరచుకుంది. అతని దయ, సహనం, మరియు ప్రేమకు ఆకర్షితురాలై.. ఆమెకు తెలియకుండానే అతనితో మళ్లీ ప్రేమలో పడింది. 2019లో మళ్లీ వివాహం చేసుకుంది. మొత్తానికి ఈ కథ నిజమైన ప్రేమకున్న శక్తిని సూచిస్తుంది.

">LINK

Next Story