- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ (Darshan) హత్య కేసులో బాధితుడైన రేణుకా స్వామి (Renuka Swamy) సమాధి ధ్వంసమైన ఘటన కర్ణాటక స్టేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ సూపర్ స్టార్ దర్శన్ (Darshan) హత్య కేసులో బాధితుడైన రేణుకా స్వామి (Renuka Swamy) సమాధి ధ్వంసమైన ఘటన కర్ణాటక స్టేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్రదుర్గ జిల్లాలోని ఓ హిందూ స్మశానవాటికలో ఉన్న రేణుకాస్వామి సమాధి, పేరు ఫలకం ధ్వంసమైనట్లుగా కుంటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
కాగా, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హీరో దర్శన్ అభిమాని. 2024 జూన్ 8న బెంగళూరులోని ఓ షెడ్‌లో అతడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారని ఆరోపణలు. దర్శన్ స్నేహితురాలు నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినందుకే అతడిని హతమార్చినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ (Pavithra Gouda)తో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్శన్ జైలులోనే ఉన్నారు. సమాధి ధ్వంసం గురించి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సమీపంలో కొత్త లేఅవుట్ నిర్మాణం సమయంలో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ పని ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రేణుకా స్వామి హత్య కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో రేణకా స్వామి ధ్వంసం దర్శన్ మరింత ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. కాగా ఇవాళ దర్శన్ కొత్త సినిమా ‘డెవిల్’ థియేటర్లలో రిలీజ్ కానుంది.






