- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: దూసుకొస్తున్న భారీ హిమపాతం.. భయానక దృశ్యాలు వైరల్
జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir) కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir) కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో బుధవారం సోన్‌మార్గ్‌లో (Sonmarg) భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. భారీ ఎత్తున మంచు దూసుకురావటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కాగా, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామం వద్ద భారీ హిమపాతం కారణంగా మంచు కొండలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 55 మంది మంచు కింద చిక్కుకోగా.. 47 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. మిగతా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, గతంలోనూ ఇక్కడ అనేక హిమపాతం ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఇవి భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో ప్రతిసారీ భారీ మంచు పడినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం స్థానిక ప్రజల కోసం అత్యవసర నియంత్రణ గదులను సిద్ధం చేస్తుంది. ప్రజలను ముందస్తుగా హెచ్చరించడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం, సైనికులను అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రస్తుత హిమపాతం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎంత కాలం కొనసాగుతుందో అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హిమపాతం (Avalanche) అంటే ఏమిటి?
హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం శీతాకాలంలో మంచు చరియలు విరిగిపడుతుంటాయి. ఈ చరియలు కేవలం 5 సెకన్ల కాలంలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుతాయి. ఈ సందర్భంగా సుమారు 2.3 లక్షల ఘనపు మీటర్ల మంచు పెరుకుంటోంది. అయితే, ఈ హిమపాతాలు సాధారణమైనవి అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు విపత్తులుగా మారుతాయి.
🇮🇳📹 A massive avalanche strikes the Indian village of Sarbal in Jammu and Kashmir. 🥶🥶#Avalanche #India #JammuAndKashmir #Disaster #weather #Kashmir #Jammu #Sarbal #BreakingNews #incredible #Indian #Pakistan pic.twitter.com/bKymfbzrsS
— Ali Shunnaq (@schunnaq) March 5, 2025






