- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్ష ఫీజు కట్టలేదని పొలం పనులకు వెళ్లిన విద్యార్థిని.. హెడ్‌మాస్టర్ ఏం చేశాడంటే?
ఓ విద్యార్థిని పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో స్కూల్ మానేసి పొలం పనులకు వెళ్ళింది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ విద్యార్థిని పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో స్కూల్ మానేసి పొలం పనులకు వెళ్ళింది. అయితే విషయం తెలుసుకున్న ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ చేసిన పనికి ఆయనను నెటిజన్స్ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఒక స్కూల్ లో రూ.500 ఫీజు కట్టలేని ఓ విద్యార్థిని ఆ పరీక్ష ఫీజు కోసం, స్కూల్ మాని పొలం పనులకు వెళ్తోంది. అయితే చదువులో చురుకుగా ఉండే ఆ విద్యార్థిని 15 రోజులుగా స్కూల్ కి రాకపోవడంతో ఆ పాఠశాల హెడ్‌మాస్టర్, స్వయంగా తానే ఆ స్టూడెంట్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు.
హెడ్‌మాస్టర్ అక్కడికి చేరేసరికి ఆ అమ్మాయి పొలాల్లో పని చేస్తూ కనిపించింది. విషయం తెలిసి చలించిపోయిన ఆయన.. డబ్బు లేనందుకే చదువు ఆగిపోకూడదు అని, తాను ఫీజు చెల్లిస్తానని, స్కూల్‌కు వచ్చి బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. కాగా దీనిని అంతటినీ పక్కనే ఉన్న మరో ఉపాధ్యాయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ హెడ్‌మాస్టర్ ను నెటిజన్స్ కొనియాడుతున్నారు.






