- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెట్టింట ఫుల్ హల్‌చల్ చేస్తోన్న ఈ వైరల్ గణనాథుడిని చూశారా! ప్రత్యేకత ఏంటంటే?
హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈనెల 27 నుంచి గణేనాథుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చతుర్థికి (Vinayaka Chathurti) ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈనెల 27 నుంచి దేశవ్యాప్తంగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విభిన్న ఆకృతుల్లో అందంగా వినాయకుడి ప్రతిమలను కళాకరులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు గణనాథుడు కొలువుదీరే మండపాలను కూడా నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల విగ్రహాల తయారీలు పూర్తి అయ్యాయి. అయితే, ప్రతి ఏడాది ఒకే విధమైన విగ్రహాలను కాకుండా కళాకారులు తమ ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేకమైన గణనాథుడి ప్రతిమలను తయారుచేస్తుంటారు. ఈ విగ్రహాలు చూస్తే ఎవరైనా సరే మైమర్చిపోవాల్సిందే! ఇలాంటి ఓ విగ్రహాం తాజాగా నెట్టింట ఫుల్ హల్ చల్ చేస్తోంది. మండపంలో కొలువుదీరడం కంటే ముందే ఈ విగ్రహాం ఎంతో మంది భక్తుల మది దోచుకుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని దూల్‌పేటలోని (Dhoolpet) గణేష్ సింగ్ కళాకార్ ఓ భారీ గణనాథుడి ప్రతిమను తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. తొండెంపై మహాశివుడి 11 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అంతా బాగున్నాడు వినాయకుడు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.






