Vira video: ఇంత స్టైలిష్ సింహాన్ని ఎప్పుడైనా చూశారా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-11 14:20:09  IST  )

సింహాన్ని అడవి రాజు అని పిలుస్తారు. ఎందుకంటే అది అత్యంత శక్తివంతమైన, బలమైన జంతువు.

Vira video: ఇంత స్టైలిష్ సింహాన్ని ఎప్పుడైనా చూశారా?
X

దిశ, వెబ్ డెస్క్: సింహాన్ని (Lion) అడవికి రాజు అని పిలుస్తారు. ఎందుకంటే అది అత్యంత శక్తివంతమైన, బలమైన జంతువు. అంతేకాదు, సింహం ఎప్పుడూ మొహం నిండా గడ్డం, జూలుతో గంభీరంగా ఉంటుంది. అందుకే దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇక నిత్యం నెట్టింట సింహాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవ్వటం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ సింహం దాని జుట్టును సైడ్ కాఫ్‌లా నెమ్మదిగా దువ్వించుకున్నట్లుగా కనిపిస్తోంది. బాగా పెరిగిన జూలు క్రమంగా తడిమినట్టుగా ఒదిగిపోయి, సింహం స్టైల్‌గా, స్టన్నింగ్ లుక్‌తో నిలబడింది. ఈ వీడియో ఎక్కడ తీసారు? దాన్ని ఎవరు అందంగా అలంకరించారనే విషయాలు తెలియరాలేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు 'ఈ లుక్‌తో సినిమా షూటింగ్‌కు పంపొచ్చు!' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story