- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఎడారిలో ఇసుక కంటే నీరు ఎక్కువ.. ఇది నిజమేనా?
తాజాగా ఎక్స్ లో ఎడారిలో ఎక్కడ చూసినా నీరే ఉందంటూ.. ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చూపించిన విజువల్స్ ఎడారిలాగే ఉన్నా..

దిశ, వెబ్‌డెస్క్: ఎడారి ప్రాంతంలో చుక్కనీరు దొరకడం కూడా కష్టమన్న విషయం తెలిసిందే. అందుకే ఎడారి అన్న పేరు వింటేనే.. అమ్మో అంటారు. అక్కడ ఇసుక తప్ప ఇంకేం ఉండదు. ఎడారిలో చిక్కుకుని తాగేందుకు నీరు లేక అల్లాడిపోయి.. ఆకలి, దాహంతో తనువు చాలించిన జంతువుల కళేబరాల ఎడారి ఇసుకతో కప్పబడి ఉంటాయి. అయితే.. తాజాగా ఎక్స్ లో ఎడారిలో ఎక్కడ చూసినా నీరే ఉందంటూ.. ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చూపించిన విజువల్స్ ఎడారిలాగే ఉన్నా.. నిజంగా ఎడారిలో అంత నీరు ఉంటుందా అని ఎవరికైనా అనుమానం వస్తుంది.
వీడియోలో ఎడారి మాదిరిగా కనిపించిన ప్రాంతం లెన్సోయిస్ మరాన్హెన్సెస్ నేషనల్ పార్క్. ఇది బ్రెజిల్ లోని మరాన్హావో రాష్ట్రంలో ఉంది. ఈ పార్కుకు ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక లక్షణాలు, జీవవైవిధ్యం ప్రపంచంలో అత్యంత విశిష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచేలా చేస్తాయి. ఎక్కువగా ఇసుక తిన్నెలతో (Sand Dunes) ఉండటంతో చూడటానికి ఎడారిలా కనిపిస్తుంది. వర్షాకాలంలో ఈ ఇసుక తిన్నెల మధ్య నీటి లగూన్‌లు ఏర్పడుతాయి. వీటిలో స్నానం చేసేందుకు అనువుగా కూడా ఉంటాయి. అయితే.. అక్కడ వేసవిలో ఈ లగూన్లు ఆవిరైపోతాయి. కానీ.. కొన్ని శాశ్వత లగూన్లు ఏడాది పొడవునా నీటిని నిలిపి ఉంచుకుంటాయి. కాగా.. ఈ పార్క్ సుమారు 1,55,000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి ఉండటంతో ఈ ప్రాంతంలో ఇసుక తిన్నెలు ఎక్కువగా కనిపిస్తాయి. సుమారు 50 మీటర్ల ఎత్తు వరకు ఉండే ఇసుక తిన్నెలు గాలి ద్వారా తన ఆకృతిని మార్చుకుంటాయి. 1981లో ఈ పార్క్ ను బ్రెజిల్ జాతీయ పార్కుగా ప్రకటించగా.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా పేరొందింది.






