Viral Video:హ్యాట్సాఫ్ బామ్మ.. 77 ఏళ్లలోనూ ట్రాక్టర్ నడుపుతూ!?

by Jakkula.Mamatha |

ప్రస్తుత రోజుల్లో నలభై ఏళ్లు దాటితే చాలు అనారోగ్య సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు.

Viral Video:హ్యాట్సాఫ్ బామ్మ.. 77 ఏళ్లలోనూ ట్రాక్టర్ నడుపుతూ!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో నలభై ఏళ్లు దాటితే చాలు అనారోగ్య సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఏ పని చేయాలన్న బద్ధకంగా ఫీలవుతుంటారు. చిన్న చిన్న పనులకే ఆయాస పడిపోతుంటారు. ఇక వృద్ధాప్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సిందే. కానీ 77 ఏళ్ల బామ్మ మాత్రం ‘Age Is Just A Number’ అని నిరూపిస్తున్నారు.

పంజాబ్‌కి చెందని బిబి నవ్‌రూప్ కౌర్( Bibi Navroop Kaur ) అనే వృద్ధురాలు తనదైన శైలిలో వ్యవసాయం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కి చెందిన బిబి నవ్‌రూప్ కౌర్ 77 ఏళ్ల వయస్సులో కూడా పొలంలో ట్రాక్టర్ నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే.. రిటైర్డ్ టీచర్‌గా హాయిగా విశ్రాంతి తీసుకోనే ఆప్షన్ ఉన్నా ఆమె దాన్ని ఎంచుకోలేదు. పొలంలో అడుగు పెట్టి స్వయం కృషితో పంటలు పండిస్తున్నారు. కౌర్ తన తాత పేరు మీద స్కూల్‌ను ప్రారంభించారు. అంతేకాదు గతంలో స్కూల్ బస్సు కూడా నడిపారు.

ఇదిలా ఉంటే.. తనను పెంచిన తల్లిదండ్రులను ఎప్పుడూ ఒంటరిగా వదిలి వేయకూడదని నమ్మి, ఆమె వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వయస్సులో కూడా, ఆమె ప్రతిరోజూ పొలాల్లో పని చేస్తూనే ఉంది. అభిరుచి, ఉద్దేశ్యానికి వయస్సు లేదని నిరూపిస్తుంది. ఆమె జీవితం గ్రామీణ పంజాబ్ యొక్క కాలాతీత స్ఫూర్తికి నివాళి. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న.. ఆమె వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Next Story