- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాదిక్ బాయ్ తో దోస్తీ కోసం హనుమంతుడే వచ్చేసాడు!
వానరం అంటే సాక్షాత్తూ ఆంజనేయస్వామి స్వరూపంగా చూస్తారు. కానీ అడవులు నరుకుతూ పోయి, వాటికి నిలువ నీడ లేకుండా వానరాలు అన్నీ ఊళ్ళలోకి వచ్చేలా చేసాము.

దిశ, వెబ్ డెస్క్ : వానరం అంటే సాక్షాత్తూ ఆంజనేయస్వామి స్వరూపంగా చూస్తారు. కానీ అడవులు నరుకుతూ పోయి, వాటికి నిలువ నీడ లేకుండా వానరాలు అన్నీ ఊళ్ళలోకి వచ్చేలా చేసాము. ఇపుడు కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు, వాటిని కొట్టి, భయపెట్టి తరిమేస్తారు. అయితే ఒకచోట మాత్రం ఓ వానరం వచ్చి ఏకంగా ఓ వ్యక్తి భుజాలపై ఎక్కి కూర్చుంది. అది వారి పెంపుడు వానరమా అంటే అదీ కాదు. ఎదో బాగా స్నేహం ఉన్నట్టు వచ్చి సరాసరి భుజాల వీపు మీద ఎక్కి, తలపై తల పెట్టుకొని నిద్ర కూడా పోయింది. ఈ వింత సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగింది. అక్కడ గల గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఓ కోతి లోపలికి వచ్చింది.
దాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. కానీ ఉద్యోగి మహ్మద్ సాదిక్ దాన్ని చూస్తూ.. ఏం కావాలి? ఏమైనా తిన్నావా? అని అడగడంతో ఆయన దగ్గరకు వెళ్లి భుజాలపైకెక్కింది. ఆయన తలపై వాలిపోయి హాయిగా నిద్రపోయింది. సాదిక్ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. సాదిక్ బాయ్ తో దోస్తీ కోసం ఏకంగా హనుమంతుడే వచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మనుషులకు మతం, భక్తి విషయాలు గాని.. నోరు లేని జీవులకు కాస్త ఆత్మీయ స్పర్శ చాలు అంటున్నారు.






