ప్రైవేట్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ఒక్కడిని చేసి హింసించిన విద్యార్థులు.. మాకు సంబంధం లేదన్న విద్యాధికారి

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-07 10:07:00  IST  )

ఓ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌ను 60 సెకన్లలో 30 చెంప దెబ్బలు కొట్టిన వీడియో వైరల్ అయింది. దీనిపై తీవ్రవ్యతిరేకత ఎదురైంది. కాలు సరిగ్గా లేని విద్యార్థిని పట్టుకుని ఇలా బాదడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. కారణం ఏదైనా..

ప్రైవేట్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ఒక్కడిని చేసి హింసించిన విద్యార్థులు.. మాకు సంబంధం లేదన్న విద్యాధికారి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌ను 60 సెకన్లలో 30 చెంప దెబ్బలు కొట్టిన వీడియో వైరల్ అయింది. దీనిపై తీవ్రవ్యతిరేకత ఎదురైంది. కాలు సరిగ్గా లేని విద్యార్థిని పట్టుకుని ఇలా బాదడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. కారణం ఏదైనా.. మరీ ఇంత కక్ష పూరితంగా వ్యవహరించాలా అనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా తాజాగా గుజరాత్ జూనాగఢ్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌కు సంబంధించిన ఇలాంటి వీడియోనే మరొకటి వైరల్ అవుతోంది. ఒక్కడిని రౌండప్ చేసి కొట్టారు. తన్నారు. ఈ విషయాన్ని బాధితుడు తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. వీడియో వైరల్ అయ్యాకే ఆ పేరెంట్స్ కూడా తెలుసుకున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారిని ప్రశ్నిస్తే.. ఈ ఘటన ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగిందని, స్కూల్స్‌లో జరిగితేనే తమ పరిధిలోకి వస్తుందని, ఈ కేసుతో తమకు సంబంధమే లేదని చెప్పాడు.

VIDEO

Next Story