Guinness World Record: 50 ఏళ్లుగా కేవలం వాటినే తింటూ గిన్నిస్ రికార్డు

by Yella Dhawani Reddy |

పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.

Guinness World Record: 50 ఏళ్లుగా కేవలం వాటినే తింటూ గిన్నిస్ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే, వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తినేసి తృప్తి పొందారు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా గత 50 ఏళ్లుగా మూడు పూటలు కేవలం బర్గర్లే తింటున్నాడు. అంతేకాదు, ఈ విషయంలో గిన్నిస్ రికార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా.. మరీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా.

అమెరికాలోని (America) విస్కాన్సిన్‌కు చెందిన డొనాల్డ్ గోర్స్కే (Donald Gorske) అనే 70 వ్యక్తి గత 50 ఏళ్లుగా ప్రతి రోజూ ఆహారంగా బర్గర్లను (Burger) తింటున్నాడు. అది కూడా కేవలం మెక్‌డొనాల్డ్ (MecD) బిగ్ మాక్ హాంబర్గర్లు మాత్రమే తింటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness world record) సాధించాడు. గోర్స్కే ఈ రికార్డు గతేడాదే సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు సాధించే నాటికి అతడు మొత్తం 32,340 బర్గర్లు తిన్నాడు. అయితే, మార్చి 15 నాటికి ఆ సంఖ్య 35 వేలకు చేరటంతో పాటు తను బర్గర్లు తినటం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ క్రమంలో తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు అతడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

డాన్ గోర్స్కే 1972 సంవత్సరంలో మెక్‌డొనాల్డ్ బిగ్ మాక్ బర్గర్‌లను తినడం ప్రారంభించాడు. ప్రతి రోజు రెండు బర్గర్లను ఆరగిస్తాడు. అయితే, సాధారణంగా ఎక్కువ బర్గర్‌లు తింటే అనేక వ్యాధులు చుట్టుముడతాయి. కానీ డాన్ గోర్స్కే తన ఫిట్‌నెస్‌ను(fitness) కాపాడుకున్నాడు. అంతేకాదు, తాను జీవిస్తున్నన్ని రోజులు ఇవే తింటానని అతడు చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే, వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తినేసి తృప్తి పొందారు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా గత 50 ఏళ్లుగా మూడు పూటలు కేవలం బర్గర్లే తింటున్నాడు. అంతేకాదు, ఈ విషయంలో గిన్నిస్ రికార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా.. మరీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా.

అమెరికాలోని (America) విస్కాన్సిన్‌కు చెందిన డొనాల్డ్ గోర్స్కే (Donald Gorske) అనే 70 వ్యక్తి గత 50 ఏళ్లుగా ప్రతి రోజూ ఆహారంగా బర్గర్లను (Burger) తింటున్నాడు. అది కూడా కేవలం మెక్‌డొనాల్డ్ (MecD) బిగ్ మాక్ హాంబర్గర్లు మాత్రమే తింటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness world record) సాధించాడు. గోర్స్కే ఈ రికార్డు గతేడాదే సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు సాధించే నాటికి అతడు మొత్తం 32,340 బర్గర్లు తిన్నాడు. అయితే, మార్చి 15 నాటికి ఆ సంఖ్య 35 వేలకు చేరటంతో పాటు తను బర్గర్లు తినటం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ క్రమంలో తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇతడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story