- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : గుర్రం మీద పెళ్లి కొడుకు.. చుట్టూ ముట్టిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
గుర్రం మీద పెళ్లి కొడుకు తరలి వస్తుండగా.. వందలాది పోలీసులు చుట్టూ మూగారు.

దిశ, వెబ్ డెస్క్ : గుర్రం మీద పెళ్లి కొడుకు తరలి వస్తుండగా.. వందలాది పోలీసులు చుట్టూ మూగారు. దాదాపు 200 మంది భారీ పోలీసుల భద్రత నడుమ ఆ పెళ్లి కొడుకు ఊరేగాల్సి వచ్చింది. ఇంతకీ దీనికి గల కారణం ఏమిటంటే.. రాజస్థాన్(Rajasthan)లోని అజ్మీర్ జిల్లాలో దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత మహిళ అరుణతో పెళ్లి నిశ్చియమైంది. కాగా, దళిత వరుడు గుర్రంపై ఊరేగడంపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడమే కాక, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశాడు. ఈ ఘటనపై అజ్మీర్ ఎస్పీ స్పందించి, వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దీంతో పలు పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 200 మంది పోలీసులను లావెరా గ్రామంలో మోహరించారు.
దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం ముందుగా గ్రామంలోని ఉన్నత కులాల వారితో చర్చించగా.. వారు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని చెప్పారు. జనవరి 21న సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మేళతాళాలు, డ్యాన్సుల మధ్య బారత్‌గా వరుడు విజయ్ గుర్రంపై ఊరేగుతూ.. వధువు అరుణ ఇంటికి చేరుకుని ఆమెను పెళ్లాడాడు. అయితే గ్రామంలోని అగ్రవర్ణాలకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకు డీజే, పటాకులు కాల్చడం వంటి హంగామాకు వధువు కుటుంబం దూరంగా ఉన్నది. మరోవైపు భారీ పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు విజయ్ గుర్రంపై ఊరేగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కుల వివక్షపట్ల నెటిజన్లు మండిపడ్డారు.






