ఫొటోగ్రాఫర్‌ను కొట్టిన పెళ్లి కొడుకు.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన పెళ్లి కూతురు.. ట్విస్ట్..

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరగాల్సిన ఓ మ్యారేజ్ డ్రామాటిక్‌గా బ్రేక్ అయిపోయింది. వధువు పక్కన నిల్చొని నీళ్లు తాగుతున్నందుకు ఫొటోగ్రాఫర్‌ను కొట్టాడు వరుడు.. ఇంత చిన్న విషయానికి ఎందుకలా బిహేవ్ చేస్తున్నావని వధువు అడిగితే.. అంతకు

ఫొటోగ్రాఫర్‌ను కొట్టిన పెళ్లి కొడుకు.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన పెళ్లి కూతురు.. ట్విస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరగాల్సిన ఓ మ్యారేజ్ డ్రామాటిక్‌గా బ్రేక్ అయిపోయింది. వధువు పక్కన నిల్చొని నీళ్లు తాగుతున్నందుకు ఫొటోగ్రాఫర్‌ను కొట్టాడు వరుడు.. ఇంత చిన్న విషయానికి ఎందుకలా బిహేవ్ చేస్తున్నావని వధువు అడిగితే.. అంతకు మించిన కోపంతో దాడి చేశాడు. దీంతో పెళ్లి కూతురు వెంటనే తనకు ఈ పెళ్లి వద్దని చెప్పేసింది. తర్వాత జరగనున్న పెళ్లి తంతుకు గుడ్ బై చెప్పేసి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కొడుకు, అతని తల్లి వరకట్నం డిమాండ్ చేస్తున్నారని కేసు పెట్టింది. ఇండోర్‌లోని కోష్టి సమాజ్ ధర్మశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బాబు ఘన్‌శ్యామ్ నగర్‌కు చెందిన పెళ్లి కూతురు తరుణ.. గౌరవ్‌ను పెళ్లి చేసుకోతోంది. నిజానికి వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ జరిగిన ఈ సంఘటనతో వధువు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 14న ఎంగేజ్మెంట్‌లో గోల్డ్ రింగ్, రూ. 51వేల కట్నం ఇచ్చామని.. తర్వాత మరింత బంగారం, డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది.

Next Story