పెళ్లిలో, భరాత్‌లో బేడీలతోనే మరి శోభనం గదిలో? వైరల్ అవుతున్న పెళ్లి కొడుకు వీడియో!

by Ajay Maddhiboyina |

ఒకసారి అమ్మాయి మనస్పూర్తిగా ప్రేమించింది అంటే చచ్చేదాకా వదలదని చెబుతుంటారు. ప్రేమించినవాడు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అతడినే పెళ్లాడుతుందని అంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన అది నిజమే అనిపించేలా ఉంది.

పెళ్లిలో, భరాత్‌లో బేడీలతోనే మరి శోభనం గదిలో? వైరల్ అవుతున్న పెళ్లి కొడుకు వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: ఒకసారి అమ్మాయి మనస్పూర్తిగా ప్రేమించింది అంటే చచ్చేదాకా వదలదని చెబుతుంటారు. ప్రేమించినవాడు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అతడినే పెళ్లాడుతుందని అంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన అది నిజమే అనిపించేలా ఉంది. తాను ఎంతగానో ప్రేమించిన యువకుడు ఓ కేసులో జైలుకు వెళ్లినా ప్రియురాలు మాత్రం అతడినే పెళ్లి చేసుకుంది. అతడు జైలులో ఉన్నప్పటికీ పట్టుపట్టి మరీ అతడే తనకు కావాలని కుటుంబాన్ని ఒప్పించింది. దీంతో ఆ యువకుడు పెరోల్ పై వచ్చి తన ప్రియురాలిని పెళ్లాడగా ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే కోర్టు ఆదేశాల మేరకు వరుడు పెరోల్ పై రావడంతో పోలీసులు అతడి చేతికి తాళ్లు కట్టి మరీ తీసుకువచ్చారు. దీంతో తాటి కట్టే సమయంలో, భరత్ లోనూ అతడు ఆ బంధకాలతోనే కనిపించాడు. అయితే ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చివరకి శోభనం గదిలోకి కూడా అలా తాళ్లు కట్టే తీసుకుపోతారా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిందని ఇప్పుడు కూడా తాళ్లతో కట్టి కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఇబ్బంది పెడితే ఎలా అంటూ మండిపడుతున్నారు.

Next Story