- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిపెద్ద బంగారు నిక్షేపం.. ఆ దేశం కష్టాలు తీరినట్లేనా? ఈ వీడియో ఎప్పటిది?
తాజాగా ఆ దేశం బంగారు గనుల్లో గోల్డ్ మైనర్లకు భారీ బంగారు నిక్షేపం దొరికిన వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్రికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుల్లో ఒకటి ఘనా. అక్కడున్న బంగారు గనులు ఆ దేశ ఆర్థిక వృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. పశ్చిమ ఘనాలో ఉన్న బంగారు గనుల నుంచి గతేడాది గోల్డ్ ఫీల్డ్స్ సంస్థ 5,37,200 ఔన్సుల బంగారం ఉత్పత్తి అయింది. మనమెంతో మక్కువగా చూసుకునే బంగారాన్ని తవ్వితీసే ఆ దేశం మాత్రం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. జీవనం గడపడం ఘనా ప్రజలకు కష్టమవుతోంది.
తాజాగా ఆ దేశం బంగారు గనుల్లో గోల్డ్ మైనర్లకు భారీ బంగారు నిక్షేపం దొరికిన వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అవుతోంది. గోల్డ్ మైనర్స్ కు ఘనాలో భారీ బంగారు నిక్షేపం దొరికిందంటూ ఆఫ్రికన్ హబ్ అనే ఎక్స్ యూజర్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఆ వీడియోను మరో యూజర్ తాజాగా రీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ వీడియో ఆగస్టు 7, 2024లో పోస్ట్ అయింది. అప్పటి వీడియోకు 12.5 మిలియన్ల వ్యూస్ రాగా.. ఆ బంగారాన్ని వాడుకుంటే.. ఘనా ఆర్థికంగా ఎదుగుతుందని, డెమోక్రసీ కోసం పోరాడితే అక్కడి ప్రజల కష్టాలు తీరుతాయని అనేకమంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు.






