- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్.. నేను కూలి బిడ్డను.. నాకో అవకాశం ఇవ్వండి.. అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట సామాన్యుడి నిరాహార దీక్ష(వీడియో)
రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్.. ఓర్పు, సహనం, నిజాయితీ, కో కంటెస్టెంట్స్ సపోర్ట్‌తో బిగ్ బాస్ సీజన్ 8 కప్ కొట్టాడు. సెలబ్రిటీగా మారిపోయాడు. దీన్నే ఆదర్శంగా తీసుకుంటున్న చాలా మంది యూట్యూబర్స్ తమకు కూడా ఓ చాన్స్ ఇవ్వాలంటూ బిగ్ బాస్‌ను

దిశ, ఫీచర్స్ : రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్‌లో చాన్స్ కొట్టేశాడు. ఓర్పు, సహనం, నిజాయితీ, కో కంటెస్టెంట్స్ సపోర్ట్‌తో బిగ్ బాస్ సీజన్ 8 కప్ కొట్టాడు. సామాన్యుడిగా ఎంటరై సెలబ్రిటీగా మారిపోయాడు. దీన్నే ఆదర్శంగా తీసుకుంటున్న చాలా మంది యూట్యూబర్స్ తమకు కూడా ఓ చాన్స్ ఇవ్వాలంటూ బిగ్ బాస్‌ను కోరుతున్నారు. హోస్ట్ కింగ్ నాగార్జునకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూలి బిడ్డను అంటూ ఓ యువకుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట నిరాహార దీక్షకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇంతకు ఆయన ఎవరు? ఏంటి? తెలుసుకుందాం.
ఇది అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ ఉండాలి అంటూ ఫేమస్ అయిన మల్టీస్టార్ మన్మధ రాజా తనను బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకోవాలని అన్నపూర్ణ స్టూడియో గేట్ ఎదుటే కూర్చున్నాడు. బ్యానర్ కట్టుకుని మరి తాను కూలి బిడ్డను అని.. సామాన్యుడినైన తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రోజూ కృష్ణ కాంత్ పార్క్ దగ్గర ఇదే చేస్తున్నాడని.. చూడలేక చస్తున్నామని అంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసి బిగ్ బాస్ ఇంట్రెస్ట్ పోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.






