వరుడికి దిమ్మతిరిగే గిఫ్ట్.. కండోమ్స్ బహుమతిగా ఇచ్చిన అమ్మాయిలు.. నెట్టింట వీడియో వైరల్!

by Ramesh Naini |

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో స్నేహితులు వరుడికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!

వరుడికి దిమ్మతిరిగే గిఫ్ట్.. కండోమ్స్ బహుమతిగా ఇచ్చిన అమ్మాయిలు.. నెట్టింట వీడియో వైరల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులకు బంధుమిత్రులు ఎన్నో రకాల గిఫ్ట్‌లు ఇస్తుంటారు. బంగారం, వెండి, ఖరీదైన బట్టలు, వాచీలు లేదా పూల బొకేలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. బహుమతులు చూసి నవ దంపతులు కూడా ఎంతో మురిసిపోతుంటారు. కానీ, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో స్నేహితులు వరుడికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే! వైరల్ వీడియో ప్రకారం.. స్నేహితుడి పెళ్లి అంటే స్నేహితులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే, ఈ వీడియోలో స్నేహితుల అల్లరి కాస్త శృతి మించింది. స్టేజ్ మీద వధూవరులు నిల్చొని ఉండగా.. ఒక్కొక్కరిగా వచ్చిన స్నేహితులు వరుడికి సైలెంట్‌గా షేక్ హ్యాండ్ ఇస్తూ అతని చేతిలో కండోమ్ ప్యాకెట్లను పెట్టారు. అలా ఒక్కొక్కరు కండోమ్ ఇచ్చి నవ్వుతూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి వెళ్లిపోయారు.

పక్కనే కొత్త పెళ్లాం.. కింద బంధువులు..

పక్కనే కొత్త పెళ్లాం.. కింద బంధువులు. స్నేహితులు వరుస కట్టి మరీ ఈ పని చేస్తుండటంతో వరుడికి ఏం చేయాలో పాలుపోలేదు. పైగా ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వారిలో చాలా మంది అమ్మాయిలు కూడా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. పక్కనే వధువు ఉందనే సోయి కూడా లేకుండా, ఏమాత్రం మొహమాటం పడకుండా స్నేహితులు ఈ పని చేశారు. ఆ తర్వాత వరుడి సూట్ జేబులు చెక్ చేస్తే.. అందులో నిండా కండోమ్ ప్యాకెట్లే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. స్నేహితులు చేసిన ఈ అల్లరి పనికి నెటిజన్లు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ‘ఒకవేళ మీ పెళ్లిలో మీ ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీ రియాక్షన్ ఏంటి?’ అంటూ కామెంట్స్ సెక్షన్‌లో ఫన్నీగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లలో ఇలాంటి ట్రెండ్స్ మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు.

Next Story