- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : రైలు ఏసీ బోగీలో సిగరెట్ తాగుతూ రచ్చ చేసిన యువతి.. ట్రైన్ నీదా అంటూ వీరంగం
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. బహిరంగ ధూమపానం నేరం కూడా. ముఖ్యంగా రైలులో సిగరెట్ కాల్చడం సెక్షన్ 167 ప్రకారం నేరం. వంద నుంచి ఐదు వందల రూపాయల జరిమానాతోపాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. బహిరంగ ధూమపానం నేరం కూడా. ముఖ్యంగా రైలులో సిగరెట్ కాల్చడం సెక్షన్ 167 ప్రకారం నేరం. వంద నుంచి ఐదు వందల రూపాయల జరిమానాతోపాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ధూమపానం కారణంగా తోటి ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాదు దీనికారణంగా ఒక్కోసారి అగ్నిప్రమాదాలు కూడా జరగొచ్చు. ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవచ్చు. అయితే తాజాగా ఓ అమ్మాయి ఏకంగా ఏసీ కంపార్ట్‌మెంట్‌లో సిగరెట్ కాలుస్తూ కనిపించింది. విండోస్ క్లోజ్ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బయటకు వెళ్లమని అడిగినా.. పట్టించుకోకపోవడంతో వీడియో తీశారు. దీంతో ఆ అమ్మాయి శివాలెత్తిపోయింది. తనకు తెలియకుండా వీడియో తీయడం నేరమని హెచ్చరించింది. దీంతో తోటి ప్రయాణికులు.. రైలులో సిగరెట్ కాల్చడం నేరం కాదా అని ప్రశ్నించారు. అది మీకెందుకని.. ముందు వీడియో డిలీట్ చేయమని గొడవకు దిగింది. ఈ రైలు ఏమైనా మీదా అంటూ వాగ్వాదం పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అదే ఒక మగాడు ఈ పని చేసి ఉంటే.. రైలులో ఉన్న అందరూ కలిసి బయటకు గెంటేసేవాళ్లని.. ఈ దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలకు న్యాయం, ధర్మం వేర్వేరుగా ఉన్నాయనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.






