- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ.. ఛీ.. ఇదేం నిమజ్జనంరా బాబు.. విగ్రహాన్ని ముక్కలు చేసి.. ఆ తర్వాత.. (వీడియో)
సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడలేని సందడి మొదలవుతుంది. ఆ పదకొండు రోజులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థిస్తారు. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎంత బుద్ధిగా దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టాపనకు తీసుకొచ్చారో

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడలేని సందడి మొదలవుతుంది. ఆ పదకొండు రోజులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థిస్తారు. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎంత బుద్ధిగా దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టాపనకు తీసుకొచ్చారో.. అంతే బుద్ధిగా నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. కన్నీటితో గంగమ ఒడికి చేరుస్తూ వీడ్కోలు పలుకుతారు. కానీ కొందరు మూర్ఖులు నిమజ్జనం పేరుతో హద్దులు మీరి ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు యువకులు గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నదికి తీసుకెళ్లారు.. కానీ ఆ పని సరిగ్గా చేయకుండా.. విగ్రహాన్ని ముక్కలు చేసి.. చేయితో ఒకరు.. తొండంతో ఒకరు.. శరీర భాగంతో మరొకరు ఆడుతూ.. పిచ్చిగా ప్రవర్తించారు. కొందరు దేవతామూర్తికి అసభ్యకరంగా ముద్దు పెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..తిట్టిపోస్తున్నారు జనాలు. దేవుడు అంటే జోక్ అయిపోయిందంటూ బూతుల వర్షం కురిపిస్తున్నారు.






