- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending : వావ్..! అదిరిపోయే ఫీచర్స్‌తో రానున్న Google Pixel 10 and 10 Pro స్మార్ట్‌ఫోన్స్..
వావ్.. ఇది విన్నారా? గూగుల్ తాజాగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో భాగమైన అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు గూగుల్ పిక్సెల్ 10, అలాగే గూగుల్ పిక్సెల్ 10 ప్రో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ అంటేనే అదిరిపోయే ఫీచర్లతో అదుర్స్ అనిపించాలి బ్రో.. అనేది యువత మనోగతం. మార్కెట్లో ఎన్నో రకాల ఫోన్లు వస్తున్నాయ్.. కానీ కొన్ని మాత్రమే ‘మమా..!’ అనిపిస్తుంటాయ్. అలాంటిదే గూగుల్ సంస్థ తాజాగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో భాగమైన అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు గూగుల్ పిక్సెల్ 10, అలాగే గూగుల్ పిక్సెల్ 10 ప్రో (Google Pixel 10 and Google Pixel 10 Pro) మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ రెండు మోడళ్లు కూడా అద్భుతమైన ఫీచర్స్‌తో, గూగుల్ టెన్సర్ G5 చిప్ బేసిస్‌తో, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి.
గూగుల్ పిక్సెల్ 10లో 6.3 అంగుళాల(inches) OLED డిస్‌ప్లే, 12 GB RAM, 256 GB స్టోరేజీ, 4970 mAh బ్యాటరీ ఉంటాయి. ఇవి హై రిజల్యూషన్ కెమెరాలతో, 8K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతోనూ ఉంటాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఏడేళ్ల పాటు OS, అండ్ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో అందుబాటులో ఉంటాయి. ఇండిగో ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్ వంటి డిఫరెంట్స్ కలర్స్‌లోనూ లభిస్తాయి.
ఇక పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 కంటే కొన్ని అడిషనల్ ఫీచర్లతో రానున్నది. ఇందులో మరింత అధునాతన కెమెరా సిస్టమ్, పెద్ద డిస్‌ప్లే ఎంపికలు ఉంటాయి. పిక్సెల్ 10 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, ప్రో XL వేరియంట్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌లు కెమెరా కోచ్, రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్స్, అలాగే జెమినీ లైవ్ వంటి AI ఫీచర్లతో మరింత వినూత్నంగా ఉంటాయి. భారత్‌లో ఈ ఫోన్‌లు ఆగస్టు 28 నుంచి గూగుల్ స్టోర్, రిటైల్ పార్ట్‌నర్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ధరలు సుమారు ధర సుమారు ₹66,996 ($799 ) నుంచి ₹83,766 ($999 )వరకు ఉంటుంది.






