- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య చేతిలో తన్నులు.. దేశ అధ్యక్షుడికి కూడా తప్పలేదు.. చెంపదెబ్బ వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఏదో గొప్ప పని చేసినందుకు అనుకునేరు.. అస్సలు కాదు.. భార్య చేతిలో తన్నులు తిని

దిశ, ఫీచర్స్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఏదో గొప్ప పని చేసినందుకు అనుకునేరు.. అస్సలు కాదు.. భార్య చేతిలో తన్నులు తిని ట్రెండ్ అవుతున్నాడు. అవును.. ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను భార్య బ్రిజిట్ మాక్రాన్ చెంపదెబ్బ కొట్టినట్లు స్పష్టంగా తెలుస్తుండగా.. ఈ నెల 25న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వియత్నాంలోని హనోయిలో విమానం నుంచి దిగుతుండగా ఈ పరిస్థితి ఎదురైంది. ఈ వీడియోలో బ్రిజిట్ తన చేతులతో మాక్రాన్ ముఖాన్ని నెట్టడం, చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.తర్వాత అతను వెనక్కి తగ్గి.. త్వరగా స్థిమితపడి ప్రెస్‌కు అభివాదం చేస్తూ విమానం మెట్లు దిగాడు. దీంతో నెట్టింట మీమ్స్ వర్షం కురుస్తోంది.
మాక్రాన్, ఆయన కార్యాలయం ఈ ఘటనను “సరదాగా ఆటపట్టించడం” అని తేలిగ్గా తీసుకున్నారు. ఎలీసీ ప్యాలెస్ మొదట వీడియో ప్రామాణికతను ప్రశ్నించింది. కానీ తర్వాత దీనిని హ్యాపీ మోమెంట్‌గా పేర్కొంది. మాక్రాన్ హనోయిలో విలేకరులతో మాట్లాడుతూ.. “మేం సరదాగా ఉన్నాం, ఇది మామూలే” అని.. ఈ ఘటనను “ప్రపంచ విపత్తు”గా అతిశయోక్తి చేయడాన్ని విమర్శించాడు. అయితే.. వీడియో ఆన్‌లైన్‌లో విపరీతమైన చర్చలకు, మీమ్‌లకు దారితీసింది. దీన్ని పబ్లిక్‌లో అవమానపరచడంగా కొందరు చిత్రీకరిస్తే.. ఇంకొందరు ఫన్నీగా తీసుకున్నారు. అంతేకాదు ఈ ఇన్సిడెంట్ వారి మధ్య ఉన్న25½ సంవత్సరాల వయసు తేడాను సూచిస్తుందని కామెంట్స్ వచ్చాయి. ఎమ్మాన్యుయెల్ 15 ఏళ్ల వయసులో, బ్రిజిట్ 39 ఏళ్ల హైస్కూల్ టీచర్‌గా ఉన్నప్పుడు ప్రారంభమైన వారి ప్రేమ ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉంది.






