Ishika Taneja : కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మాజీ మిస్ ఇండియా

by Muthe.Rajitha |

ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహాకుంభమేళా(Mah KumbhMela)లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.

Ishika Taneja : కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మాజీ మిస్ ఇండియా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహాకుంభమేళా(Mah KumbhMela)లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహాకుంభమేళా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి సాధువులు, అఘోరాలు, ఋషులు, ప్రజలు, సెలెబ్రెటీలు, విదేశీయులు ప్రయాగ్ రాజ్ కు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఇక్కడ పుణ్య స్నానాల కోసం వచ్చే ఎంతోమంది సన్యాసం(Sanyasa) కూడా తీసుకుంటున్నారు. వీరిలో కూడా అనేక మంది సెలెబ్రెటీలు ఉండటం విశేషం. ఇటీవల బాలీవుడ్ నటి మమతా కులకర్ణి(Bollywood Actress Mamatha Kulakarni) కుంభమేళాలో పుణ్యస్నానానికి వచ్చి సన్యాసం తీసుకున్న విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

తాజాగా మరో ప్రముఖ సెలెబ్రెటీ కూడా సన్యాసం బాటపట్టి పెను దుమారాన్ని రేపింది. మాజీ మిస్ ఇండియా(Former Miss India), బాలీవుడ్ నటి ఇషికా తనేజా(Ishika Taneja) మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె పేరే ఇషికా తనేజా. ఇషికా 2017లో మిస్ ఇండియా అందాల పోటీలో ‘పాపులారిటీ, మిస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్’ టైటిళ్లను గెలుచుకుంది. అలాగే మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకొని, పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ద్వారక-శారదా పీఠానికి(Dwraka- Sharada Peetham) చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి(Shankaracharya Sadananda Saraswathi) నుంచి గురు దీక్ష తీసుకుంది. అదేవిధంగా తన పేరును శ్రీలక్ష్మి(SriLaxmi)గా మార్చుకుంది. ప్రస్తుతం ఇషికా తనేజా కాషాయం ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఇషికా తనేజా 1994, సెప్టెంబర్ 2న భారతీయ మూలాలున్న మలేషియా కుటుంబంలో జన్మించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఇందు సర్కార్ సినిమాలో ఒక ప్రమోషనల్ పాటలో నటించింది. హద్ సినిమాలో రియా పాత్ర పోషించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా.. రాష్ట్రపతి అవార్డును అందుకుంది. 2014 సంవత్సరంలో, ఇషిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Next Story