ఫ్లిప్‌కార్ట్ ఫ్రాడ్‌: మ్యాక్‌బుక్ ఆర్డర్‌ చేశాడు.. బాక్స్ ఓపెన్‌చేస్తే షాక్‌!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-24 16:16:21  IST  )

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటుపడిపోయారు. టీవీ, ల్యాప్‌టాప్ మొబైల్ ఫోన్‌ల దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరకుల వరకు ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ ఫ్రాడ్‌: మ్యాక్‌బుక్ ఆర్డర్‌ చేశాడు.. బాక్స్ ఓపెన్‌చేస్తే షాక్‌!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు (Online shopping) అలవాటుపడిపోయారు. టీవీ, ల్యాప్‌టాప్ మొబైల్ ఫోన్‌ల దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరకుల వరకు ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. పైగా ఈ కామర్స్ (E-commerce) సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రకటించటంతో ఆఫ్ లైన్ కంటే ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తుంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. డెలివరీ తీసుకున్న కస్టమర్‌లు తాము ఆర్డర్ చేసిన వస్తువు లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఈ తరహా సంఘటనలు వినియోగదారుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. రూ.1.5 లక్షల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోని (MacBook pro) ఆర్డర్ చేస్తే డెలివరీ అయినా వస్తువులను చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ ఎక్స్ వినియోగదారుడు 'రూ.5,000 ఎక్కువ చెల్లించి అయినా సరే బ్రాండ్ స్టోర్ నుంచే కొంటాను. కానీ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఇంకెప్పుడు కొనను' అంటూ తాజాగా రెండు వీడియోలను తన ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో ఆ యూజరు ఫ్లిప్ కార్టు నుంచి రూ.1.5లక్షలు విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోను ఆర్డర్ చేశాడు. ఎప్పుడెప్పుడు తన ఆర్డర్ డెలివరీ అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూశాడు. అయితే, ల్యాప్‌టాప్ డెలివరీ అయ్యాక బాక్స్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఎందుకంటే.. అందులో పాతబడిపోయినా ల్యాప్‌టాప్ ఉంది. అయితే, ఈ వీడియో అన్‌బాక్సింగ్ డెలివరీ బాయ్ చేయటంతో వెంటనే రిటన్ పంపించేశాడు. మరో వీడియోలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో విసిగిపోయినా సదరు యూజరు డబ్బులు ఎక్కువ పెట్టి అయినా స్టోరులోనే కొంటా కానీ, ఇంకెప్పుడు ఫ్లిప్‌కార్టులో కొననంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు కామెంట్లలో పంచుకుంటున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

* ఏ వస్తువు కొన్నా డెలివరీ తీసుకునే సమయంలో అన్‌బాక్సింగ్ వీడియో తీయటం తప్పనిసరి.

* షిప్‌మెంట్ వివరాలు జాగ్రత్తగా పరిశీలించాలి.

* ప్రామాణిక సేలర్లు, బ్రాండ్ సర్టిఫైడ్ స్టోర్ల నుంచే కొనుగోలు చేయాలి.

Next Story