తేలును మింగేసిన చేప(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-02 11:49:30  IST  )

భూమిపై జీవులు శత్రువుల నుంచి కాపాడుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని విషపూరితంగా మారుతాయి. ఈ వర్గానికి చెందినవే తేళ్లు కూడా.

తేలును మింగేసిన చేప(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : భూమిపై జీవులు శత్రువుల నుంచి కాపాడుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని విషపూరితంగా మారుతాయి. ఈ వర్గానికి చెందినవే తేళ్లు కూడా. అయితే ఒక చేప తేలును తినడం ఎప్పుడైనా చూశారా? లేదు కదా.. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేలు, చేప మధ్య జరిగిన పోరులో చేప.. ఒక్కో పార్ట్ మింగుతూ.. తేలును తినేసింది. ఇది బ్యాండెడ్ లెపోరినస్ (లెపోరినస్ ఫాసియాటస్) చేప కాగా.. అమెజాన్ బేసిన్‌కు చెందిన మంచినీటిలో ఉంటుంది. ఇతర జీవులను తింటుంది. అక్వేరియంలలోనూ దూకుడుగా ఉంటుంది.ఈ షాకింగ్ వీడియో ఇప్పటికే భారీ వ్యూస్, లైక్స్ సంపాదించగా.. హాలీవుడ్‌కు మించిన సినిమా చూసినట్లు ఉందంటున్నారు నెటిజన్లు. అడవి ప్రపంచం మాత్రమే కాదు నీటి ప్రపంచం కూడా అంతే ప్రమాదకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Next Story