FIRST NIGHT : జంబలకిడి పంబ.. ఈ శోభనం ఏదో తేడాగా ఉందే.. మొదటి రాత్రి వీడియో మొత్తం తీసి పెట్టేశారుగా..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-27 05:48:39  IST  )

పెళ్లి తర్వాత మొదటి రాత్రి జరగడం సాధారణం. ఇది సంప్రదాయం కూడా. అయితే ఈ శోభనం రాత్రి నవ వధువు.. తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని చక్కగా ముస్తాబై.. చేతిలో పాల గ్లాసుతో.. ముత్తయిదువులు దగ్గరుండి

FIRST NIGHT : జంబలకిడి పంబ.. ఈ శోభనం ఏదో తేడాగా ఉందే.. మొదటి రాత్రి వీడియో మొత్తం తీసి పెట్టేశారుగా..
X

దిశ, వెబ్‌సైట్ : పెళ్లి తర్వాత మొదటి రాత్రి జరగడం సాధారణం. ఇది సంప్రదాయం కూడా. అయితే ఈ శోభనం రాత్రి నవ వధువు.. తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని చక్కగా ముస్తాబై.. చేతిలో పాల గ్లాసుతో.. ముత్తయిదువులు దగ్గరుండి సాగనంపగా.. సిగ్గుపడుతూ.. భర్త ఉన్న గదిలోకి వెళ్తుంది. సగం, సగం పాలు తాగి.. స్వీట్స్, పండ్లు తిని.. ఎంజాయ్ చేస్తుంటారు. నార్మల్‌గా అయితే ఇదే జరుగుతుంది. కానీ ఇందుకు ఫుల్ అపోజిట్‌గా తంతు జరిపించగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేల్ ఫ్రెండ్స్ అంతా దగ్గరుండీ.. అబ్బాయికి చీర కట్టి.. జడ వేసి.. చక్కగా బొట్టుపెట్టి..చేతికి పాల గ్లాసు ఇచ్చి.. పాటలు పాడుతూ.. అమ్మాయి గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురుకు పాల గ్లాసు ఇవ్వగా.. ఆమె సగం తాగి.. అతనికి సగం ఇచ్చింది. ఆ తర్వాత ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జంబలకిడి పంబ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదేం ఖర్మరా బాబు.. శోభనం వీడియో తీసుకోవడమే కాదు సోషల్ మీడియాలో పెట్టేశారు.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనకుంటున్నారు.. ఇక్కడి వరకు ఓకే ఆ తర్వాత జరిగే తంతులో కూడా అపోజిట్‌గానే ఉంటుందా మరి అంటూ ప్రశ్నిస్తున్నారు.

VIDEO

Next Story