- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.500 నోట్లను నాటి వ్యవసాయం.. నీళ్లను పెడుతూ పంటను రక్షిస్తున్న రైతు (వీడియో)
సాధారణగా వ్యవసాయం అంటే వరి, పత్తి, మక్కలు, కూరగాయల సాగే అనుకుంటారు. మరికొందరు రైతులు హార్టికల్చర్, సెరీకల్చర్, ఫౌల్ట్రీ ఫామ్‌లను నిర్వహిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణగా వ్యవసాయం అంటే వరి, పత్తి, మక్కలు, కూరగాయల సాగే గుర్తుకువస్తాయి. మరికొందరు రైతులు హార్టికల్చర్, సెరీకల్చర్, ఫౌల్ట్రీ ఫామ్‌లను నిర్వహిస్తుంటారు. వీటిన్నీటికి భిన్నంగా ఓ వ్యక్తి 500 రూపాయలను నోట్లను తన భూమిలో నాటి సాగు చేస్తున్నాడు. ఆ నోట్లకు నీళ్లను అందిస్తూ కంటికి రెప్పలా పంటను రక్షించుకుంటున్నాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నిజమే. కానీ ఆ పంట నుంచి ఏ దిగుబడిని ఆశించి ఆ రైతు ఈ సాగును వెంచుకోలేదు. ఇన్సూరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులకు కనువిప్పు కలగాలనే ఈ విధమైన ‘నిరసన సాగు’ను ఎంచుకున్నాడు. ఇంతకూ ఆ రైతు సమస్య ఏంటో చూద్దాం రండి.
రాజస్థాన్ రాష్ట్రం, నాగౌర్ జిల్లా డియోరియా జతన్ గ్రామానికి చెందిన మల్లారం బవారీ అనే రైతు బ్యాంక్‌లో రూ.లక్ష లోన్ తీసుకోని పత్తిపంటను సాగు చేశాడు. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. అయితే అతివృష్ఠి కారణంగా చేతికి వచ్చిన పత్తి పంట మొత్తం నీటమునిగి పనికిరాకుండా పోయింది. ఈ సీజన్‌లో ఆ కరాబ్ అయిన పత్తి పంటను విక్రయిస్తే కేవలం 4 వేల రూపాయలు మాత్రమే బవారీకి వచ్చాయి. దీంతో ఆ రైతు ఇన్సూరెన్స్ క్లయిమ్ ఇవ్వాలని బీమా సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ రైతు విజ్ఞప్తులకు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు గానీ, అటు ఇన్సూరెన్స్ కంపెనీ గానీ స్పందించలేదు. చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రైతు.. పంట అమ్మగా వచ్చిన రూ.4 వేలతోపాటు మరికొంత డబ్బుతో రూ.500 నోట్లను తన పొలంలో నాటు పెట్టాడు. వాటికి నీళ్లను అందించి నిరసన చేపట్టాడు. తనకు మోసం చేసిన బీమా సంస్థపై, పరిహారం ఇప్పించలేని వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నెటిజన్లు రైతుకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. వెంటనే ఇన్సూరెన్స్ సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు రైతుకు క్లయిమ్ అందించాలని, అతడి విజ్ఞపనా సరైనదే అంటే కామెంట్స్ చేస్తున్నారు. అలాగే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ అన్నదాత సమస్యలను పట్టించుకోని అగ్రికల్చర్ అధికారులను డిస్మిస్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, బీమా సంస్థ స్పందిస్తుందేమో చూడాలి.






