రైతులు సేఫ్...డ్రోన్స్ తో వాటిని కూడా తరిమికొట్టొచ్చు!

by velandi.Saikiran |   (  Updated:2025-06-25 07:45:06  IST  )

వ్యవసాయం.. మన భారతదేశంలో చాలామంది ప్రజలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం లేకపోతే మరో జీవనోపాధి

రైతులు సేఫ్...డ్రోన్స్ తో వాటిని కూడా తరిమికొట్టొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయం.. మన భారతదేశంలో చాలామంది ప్రజలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం లేకపోతే మరో జీవనోపాధి ఇండియన్స్ కు చాలా తక్కువే. అదే సమయంలో దిగుబడి కూడా.. రైతులు బాగానే తీస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు... తగిన చర్యలు తీసుకుంటున్నాయి. రైతు భరోసా లాంటి ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి ప్రభుత్వాలు.

అయితే... ఈ మధ్య కాలంలో పంట పొలాల్లో డ్రోన్లు (Drons ) కూడా వాడుతున్నారు రైతులు. పెస్టిసైడ్స్ (Pesticides), ఇతర క్రిమి సంహారక మందులు స్ప్రే చేయడానికి... డ్రోన్లు వాడుతున్నారు. డ్రోన్లు ఉపయోగించి.... ఖర్చు కూడా తగ్గించుకుంటున్నారు రైతులు ( Farmers). అయితే తాజాగా... ఓ రైతు డ్రోన్లతో అదిరిపోయే ప్లాన్ చేశాడు. సాధారణంగా కొన్ని పంట పొలాల్లోకి జంతువులు వచ్చి మేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పందులు మాత్రం పంట పొలాల్లోకి.. ఎంటర్ అయ్యి... చిత్తడి చిత్తడి చేస్తాయి.

అయితే అలాంటి జంతువులను అరికట్టేందుకు... డ్రోన్లకు ఓ వల లాంటిది ఏర్పాటు చేశాడు. దాంతో పందులు, ఇతర జంతువులను పట్టి... అడవిలో వదిలేయవచ్చు. తాజాగా వైరల్ అయిన వీడియోలో సదరు రైతు అలాగే చేశాడు. పంట పొలాలను తినేందుకు వచ్చిన ఓ పందిని... డ్రోన్ వచ్చి ఎగరేసుకుపోయింది. ఆలా తీసుకువెళ్లేలా ప్లాన్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్... రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ రైతు అదిరిపోయే ప్లాన్ చేశాడని మెచ్చుకుంటున్నారు.

instagramme link

Next Story