- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిపెద్ద గుమ్మడికాయ పండించి రైతు రికార్డు.. బరువెంతో తెలుసా?
ప్రపంచంలోని పలు దేశాల్లో ఏటా గుమ్మడికాయల పోటీలు నిర్వహిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని పలు దేశాల్లో ఏటా గుమ్మడికాయల (Pumpkin) పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో అత్యంత బరువైన గుమ్మడికాయను పండించిన రైతుకు బహుమతిని అందజేస్తుంటారు. తాజాగా దక్షిణాఫ్రికాలోని (Southafrica) కల్లినన్ ప్రాంతంలో గుమ్మడికాయ పోటీలను నిర్వహించారు. కల్లినన్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కార్నెలి బెస్టర్ అనే రైతు 445 కిలోల గుమ్మడికాయను పండించి, ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. అయితే, ఈ అవార్డు ఆయనకు కొత్తేమి కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే మొదటి బహుమతి గెలుచుకున్నారు. అయితే, ఈ ఏడాదిలో కాయ బరువు తగ్గడానికి కారణం.. భూతాపోన్నతి కావచ్చని రైతు అంచనా వేశారు. కాగా, వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ప్రతి ఏటా ఈ తరహా వార్షిక పోటీలు నిర్వహిస్తోంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు.






