బతికి ఉండగానే సమాధి నిర్మించుకున్న రైతు

by Muthe.Rajitha |

బతికి ఉండగానే తన సమాధి తానే నిర్మించుకున్నాడు ఓ రైతు.

బతికి ఉండగానే సమాధి నిర్మించుకున్న రైతు
X

దిశ, వెబ్ డెస్క్ : బతికి ఉండగానే తన సమాధి తానే నిర్మించుకున్నాడు ఓ రైతు. ఈ విచిత్ర ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుత జగిత్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన 80 ఏళ్ల రైతు నక్క ఇంద్రయ్య తన ఆలోచనలతో సమాజానికి ఒక గొప్ప జీవిత సత్యాన్ని చాటారు. మరణం తథ్యమని నమ్మి, తన తర్వాత కుటుంబానికి ఎలాంటి భారం ఉండకూడదనే ఉద్దేశంతో సుమారు రూ.12 లక్షల వ్యయంతో బతికుండగానే తన సమాధిని నిర్మించుకున్నారు. తన భార్య సమాధి పక్కనే గ్రానైట్‌తో ఈ సమాధిని కట్టించుకున్న ఇంద్రయ్య.. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. ఏదీ శాశ్వతం కాదని, మనిషి జీవితం క్షణభంగురమనే భావనతో ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ఎంతో మందిని ఆలోచింపజేస్తున్నాయి.

Next Story