VIDEO: కిడ్నీ స్టోన్స్ బాబా.. ఎంత పెద్ద స్టోన్ ఉన్నా నోటితోనే బ్లాస్టింగ్

by Ajay Maddhiboyina |

ఇండియాలో లాజిక్కుల కంటే మ్యాజిక్కులను నమ్మేవాళ్లే ఎక్కువ, అందుకే ఇక్కడ సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్.. ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్. దేశంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే ఈ డైలాగ్ నిజమనే అనిపిస్తుంది.

VIDEO: కిడ్నీ స్టోన్స్ బాబా.. ఎంత పెద్ద స్టోన్ ఉన్నా నోటితోనే బ్లాస్టింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో లాజిక్కుల కంటే మ్యాజిక్కులను నమ్మేవాళ్లే ఎక్కువ, అందుకే ఇక్కడ సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్.. ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్. దేశంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే ఈ డైలాగ్ నిజమనే అనిపిస్తుంది. కొందరు దేవుళ్ల పేరు చెప్పుకుని ఎంత పెద్ద రోగమైనా తగ్గిస్తామని ఆపరేషన్లు, స్కానింగ్లు లేకుండానే మంత్రాలతో వైద్యం చేసేస్తారు. రోగం తగ్గినమాట దేవుడెరుగు కానీ మూడనమ్మకాలతో రోగం తగ్గిపోతుందని జనాలు క్యూ కడుతుంటారు.

తాజాగా అలాంటి ఓ దొంగ బాబా వీడియోనే వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని బాబా యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందినవాడని తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ వద్ద ఈ బాబా కిడ్నీ స్టోన్స్ వచ్చిన వారికి నోటీతోనే వైద్యం చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి బాబా దగ్గరకు వెళ్లగా అతడి వీపుకు ఏదో పసరు రాసి తరవాత నోటితో స్టోన్ తీసేసినట్టు నమ్మించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో బాబాకు కాదు ముందు అతడివద్దకు వెళుతూ వైద్యం చేయించుకునేవారికి తెలివి ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాబా వైద్యం తీరుపై జోకులు పేలుస్తున్నారు. video

Next Story