VIDEO VIRAL: నా ఉద్యోగం పోయినా పర్వాలేదు..ఓవర్ టైమ్ వర్క్‌పై యువతి ఫైర్

by Ajay Maddhiboyina |

టాక్సిక్ వ‌ర్క్ క‌ల్చ‌ర్‌ను విమర్శిస్తూ ఓ మహిళ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఓవర్ టైమ్ వర్క్ పై మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

VIDEO VIRAL: నా ఉద్యోగం పోయినా పర్వాలేదు..ఓవర్ టైమ్ వర్క్‌పై యువతి ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాక్సిక్ వ‌ర్క్ క‌ల్చ‌ర్‌ను విమర్శిస్తూ ఓ మహిళ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఓవర్ టైమ్ వర్క్ పై మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది హార్ట్ వర్క్‌ను సపోర్ట్ చేయడంపై మండిపడింది. ఆఫీస్ టైమ్‌కు మించి పనిచేయాలని చెప్పడంతో తాను నిరాకరించి బయకు వచ్చినట్టు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా కొందరు ఆమెను ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. శతాక్షి పాండే అనే యువతి ఈ వీడియోను షేర్ చేసింది.

తాను ఇప్పుడే ఇంటికి వెళుతున్నానని, తన రిపోర్టింగ్ మేనేజర్ మరికొంత సమయం పనిచేయాలని చెప్పాడని తెలిపింది. కానీ తాను చేయనన్నానని సమయానికి ఇంటికివెళ్లాలని చెప్పినట్టు పేర్కొంది. కానీ తన మేనేజర్ నేను నిన్న రాత్రి 10:30 గంట‌ల‌కు ట్రైన్ లో ఉన్నా... మ‌ళ్లీ ఉద‌యం 7:30 గంట‌ల‌కే ఆఫీసుకు వ‌చ్చాన‌ని చెప్పాడంది. దీంతో మీరు చాలా స‌మ‌యం ఆఫీసులోనే ఉన్నారు ఇంటికి వెళ్లండి.. అని సూచించిన‌ట్టు తెలిపింది.

ఒక వ్య‌క్తి రెండు పూట‌లా ప్ర‌శాంతంగా తిన‌డం కోస‌మే సంపాదిస్తాడు కానీ ఆ భోజ‌నం కూడా ప్ర‌శాతంగా తిన‌క‌పోతే దాని అర్థం ఏంటి అని ప్ర‌శ్నించింది. హార్డ్ వ‌ర్క్ ను కీర్తించ‌డం మానుకోవాల‌ని సూచించింది. అధిక ప‌నితో మిమ్మ‌ల్ని మీరు చంపుకోవ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం కాద‌ని స్ప‌ష్టం చేసింది. నేను దానికి అంగీక‌రించ‌న‌ని, ఉద్యోగం నుండి తొల‌గించినా అభ్యంత‌రం లేద‌ని చెప్పింది. ఎక్స్ జ‌న‌రేష‌న్, వై జ‌న‌రేష‌న్ వాళ్లు అధికప‌నిని ప్ర‌శంసించ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. దీంతో మ‌రోసారి ప‌నిఒత్తిడిపై నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది. video

Next Story