ఝార్ఖండ్‌-రాంఘర్‌లో ఏనుగు బీభత్సం.. సెల్ఫీ తీసుకుందామని వెళితే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-18 04:09:12  IST  )

సెల్ఫీల మోజులో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్ర‌మాద‌క‌రంగా ఉండే ప్ర‌దేశాల‌కు వెళ్లి సెల్పీలు తీసుకుని ఏదో సాధించిన‌ట్టు ఫీల్ అవుతారు.

ఝార్ఖండ్‌-రాంఘర్‌లో ఏనుగు బీభత్సం.. సెల్ఫీ తీసుకుందామని వెళితే
X

దిశ,వెబ్ డెస్క్: సెల్ఫీల మోజులో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్ర‌మాద‌క‌రంగా ఉండే ప్ర‌దేశాల‌కు వెళ్లి సెల్పీలు తీసుకుని ఏదో సాధించిన‌ట్టు ఫీల్ అవుతారు. కానీ దాని వ‌ల్ల ప్రాణాలే పోతాయ‌ని గ్ర‌హించరు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఝార్ఖండ్ లోని రాంఘ‌ర్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొంత‌మంది ఏనుగు వ‌ద్ద‌కు వెళ్లి దానితో సెల్ఫీలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ఆగ్ర‌హించిన ఏనుగు వారి వెంట‌ప‌డింది.

స‌మూహం అంద‌రినీ ప‌రుగులు పెట్టించింది. చివ‌రికి ఓ వ్య‌క్తి ఏనుగు చేతికి చిక్క‌డంతో అత‌డిని కింద‌ప‌డేసింది. తొండెంతో కొడుతూ రెండు కాళ్లు అత‌డిపై పెట్టి న‌లిపేసింది. చివ‌రికి అత‌డు చ‌నిపోయే వ‌ర‌కు ఏనుగు వ‌ద‌ల్లేదు. అత‌డిని చంపేలోపే మిగితా వాళ్లంతా ఏనుగుకు చిక్క‌కుండా అరుస్తూ ప‌రుగులు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌ను ఓ వ్య‌క్తి వీడియో తీయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లిన వ్య‌క్తుల‌పై మండిప‌డుతున్నారు. VIDEO


Read More..

VIRAL: ప్రేమ విషయం చెప్పిన కూతురు.. తండ్రి చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Next Story