- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏనుగు రాణి, బొద్దుగా ఉంటేనే ఎంట్రీ.. ఇవేం అందాల పోటీలురా సామీ
అందాల పోటీలు అంటే స్లిమ్‌గా, జీరో సైజ్ మెయిన్ టైన్ చేసే అమ్మాయిలే కనిపిస్తుంటారు. సన్నగా అవ్వడం కోసం వాళ్లు నెలల తరబడి డైటింగ్ చేస్తూ, వ్యాయామాలు చేస్తుంటారు. నాజూగ్గా కనిపించేందుకు నచ్చినవి తినడం కూడా మానేస్తారు. కానీ థాయ్ లాండ్ లో మాత్రం వింత అందాల పోటీలను నిర్వహిస్తారని తెలుసా.

దిశ, వెబ్ డెస్క్: అందాల పోటీలు అంటే స్లిమ్‌గా, జీరో సైజ్ మెయిన్ టైన్ చేసే అమ్మాయిలే కనిపిస్తుంటారు. సన్నగా అవ్వడం కోసం వాళ్లు నెలల తరబడి డైటింగ్ చేస్తూ, వ్యాయామాలు చేస్తుంటారు. నాజూగ్గా కనిపించేందుకు నచ్చినవి తినడం కూడా మానేస్తారు. కానీ థాయ్ లాండ్ లో మాత్రం వింత అందాల పోటీలను నిర్వహిస్తారని తెలుసా. సాధారణంగా అయితే అందం అంటే స్లిమ్‌గా ఉండటమే అని అనుకుంటారు కానీ థాయ్ లాండ్‌లో నిర్వహించే అందాల పోటీల్లో ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉన్నట్టు. ఈ అందాల పోటీలను ఎలిఫెంట్ క్వీన్ పోటీలు అంటారు. అంటే తెలుగులో ఏనుగు రాణి పోటీలు అన్నమాట. పేరులాగే ఈ పోటీల్లో పాల్గొనాలి అంటే ఎంట్రీ కూడా వింతగా ఉంది. బొద్దుగా ఉండేవాళ్ల అందాల పోటీలు కాబట్టి సన్నగా ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. ఈ పోటీల్లో అందంగా కనిపించాలి అంటే కనీసం 79 కేజీలు ఉండాల్సిందే.. అప్పుడే ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక సాధారణ అందాల పోటీల్లో అయితే ఎలాంటి దుస్తులు అయినా వేసుకోవచ్చు.
ముఖ్యంగా ఎక్స్ పోజింగ్ చేసే వాళ్లకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఎలిఫెంట్ క్వీన్ లో రాణి లానే సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కంటెస్టెంట్ లు కనిపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలను బుద్ధ పవిత్ర దినాలలో నిర్వహిస్తుంటారు. థాయిలాండ్ లో జరిగే బౌద్ద వేడుకలలో ఏడాదికి ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తారు. థాయిలాండ్ భాషలో ఎలిఫెంట్ క్వీన్ పోటీలను తిడాచాంగ్ అని అంటారు. సాధారణంగా థాయిలాండ్ లో ఏనుగులను పూజిస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే బొద్దుగా ఉన్న మహిళల కోసం ఈ ఏనుగు రాణి పోటీలను నిర్వహిస్తారని చెబుతుంటారు. కామన్ గా థాయిలాండ్ అంటే అందమైన, నాజూకైన అమ్మాయిలు ఉంటారని భారతీయులు ఎక్కువగా ఈ టూరిస్ట్ దేశానికి వెళుతుంటారు. ఇప్పుడు ఎలిఫెంట్ క్వీన్ పోటీలు నిర్వహిస్తారనే వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఇవేం పోటీలురా సామీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.






