- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోల్ ప్లాజా వద్ద ఏనుగు బీభత్సం...తృటిలో తప్పించుకున్న డ్రైవర్
by Ajay Maddhiboyina |
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్-హరిద్వార్ హైవేపై టోల్ ప్లాజా వద్ద ఏనుగు భీబత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్-హరిద్వార్ హైవేపై టోల్ ప్లాజా వద్ద ఏనుగు భీబత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ కారుపై దాడి చేసింది. తొండం కాళ్లతో కారును పక్కకు నెట్టేసింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ముందుకు నడిపాడు.
ఏనుగు దాడి చేసే సమయంలోనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఏనుగు రోడ్డు దాటుతూ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వాహనదారులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు ఏనుగుల నుండి మనుషులను కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డ్ అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. video
Next Story






