హాల్‌‌టికెట్‌‌తో తుర్రుమన్న గద్ద.. చివరికి ఇచ్చిందా? కేరళలో అభ్యర్థికి వింత అనుభవం

by Ramesh Naini |

కేరళలో (Kerala) పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) పరీక్ష రాసే అభ్యర్థికి ఓ వింత ఘటన ఎదురైంది.

హాల్‌‌టికెట్‌‌తో తుర్రుమన్న గద్ద.. చివరికి ఇచ్చిందా? కేరళలో అభ్యర్థికి వింత అనుభవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలో (Kerala) పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) పరీక్ష రాసే అభ్యర్థికి ఓ వింత ఘటన ఎదురైంది. పరీక్ష కేంద్రం బయట అభ్యర్థులు, అధికారులు అందరూ చూస్తుండగానే అభ్యర్థి హాల్‌ టికెట్‌ (hall ticket) లాక్కోని ఓ పక్షి తుర్రుమన్నది. ఇవాళ (గురువారం) ఉదయం కాసరగోడ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7:30 గంటలకు సెంటర్ వద్ద అభ్యర్థి హాల్ టికెట్‌ను పక్కన పెట్టుకోని కూర్చున్నాడు. ఇంతలో ఒక గద్ద వచ్చి అభ్యర్థి హాల్ టికెట్ ముక్కుతో లాక్కోని ఎగిరింది. ఈ క్రమంలోనే హల్ టికెట్‌ను పక్షీకాళ్లతో పట్టుకోని పై ఫ్లోర్‌లో ఉన్న ఎగ్జామ్ సెంటర్ హాల్ కిటికీపై ప్రశాంతంగా కూర్చుని అటూ ఇటూ చూడసాగింది.

ఇక షాకింగ్‌కు గురైన అభ్యర్థికి ఏమి చేయాలో తోచలేదు. రాళ్లు విసిరి హాట్ టికెట్ తీసుకోవాలని ఇతరులు అభ్యర్థికి సూచించినప్పటికీ, ఆ గద్ద సెంటర్ వద్ద నుంచి ఎస్కేప్ అవుతుందేమోనని భయపడి అభ్యర్థి వెనక్కి తగ్గాడు. చివరికి గంట మోగుతుండగా, గద్ద హాల్ టికెట్‌ను పడవేసింది. ఎలాగోలా హాల్‌టికెట్‌ను గద్ద వదిలిపెట్టడంతో అభ్యర్థి ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story